ప్రస్తుతం తెలుగు దేశం పార్టీకి చాలా గడ్డు పరిస్థితి నడుస్తోంది. గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నూ ఓ వెలుగు వెలిగిన ఆ పార్టీ ఇప్పుడు తన చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటోంది. ఆంధ్రప్రదేశ్ లో ఘోర పరాజయం కారణంగా అధికారం కోల్పోగా..ఇక తెలంగాణలో ఆ పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడిన దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఫోటో వైరల్ గా మారుతోంది.


అదే తెలుగు దేశం బీడీలు.. కింది తరగతి శ్రామిక వర్గం ఎక్కువగా వాడే బీడీ పరిశ్రమలో తెలుగు దేశం చేరిందా అంటూ ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఇక తెలుగుదేశం నేతలు ఇలా బీడీలు అమ్ముకుంటా బతకాల్సిందే అంటూ కొందరు ఆ పార్టీ వ్యతిరేకులు దీనిపై కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అని ఆ పార్టీ నాయకులే డిసైడ్ అయ్యారని అందుకే.. ఇలా బీడీల వ్యాపారానికి దిగారని కామెంట్లు పెడుతున్నారు.


ఇక ఈ ఫోటో విషయానికి వస్తే.. తెలుగుదేశం పార్టీ రంగు పసుపులోనే ఈ బీడీ కట్టల ప్యాకెట్ ఉంది. దీనిపై తెలుగుదేశం బీడీలు అంటూ టైటిల్ ఉంది. తెలుగు దేశం పార్టీ సింబల్ అయిన ఇల్లు, నాగలి, కార్మిక చక్రం ఉన్న లోగో కూడా ఉంది. దీనికి తోడు ఈ తెలుగుదేశం బీడీల ట్రేడ్ మార్కు కూడా ఆ పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్ కావడం విశేషం. ఈ బీడీ ఫ్యాక్టరీ కడపలో ఉన్నట్టు ఆ ప్యాకెట్ కవర్ తెలియజేస్తోంది.


అయితే ఇండియా హెరాల్డ్ గ్రూపు ఈ ఫ్యాక్టరీ యజమాని అబ్దుల్ ఖాదిర్‌ తో ఈ విషయంపై సంప్రదించింది. ఆయన ఏమంటున్నారంటే.. ఇది కొత్తగా పెట్టింది కాదండీ.. 2007లో ఈ తెలుగుదేశం బీడీలు ఫ్యాక్టరీని స్టాపించాం. మాకు అన్నీ లైసెన్సులు ఉన్నాయి. ఇటీవల తెలుగు దేశం పార్టీ ఓడిపోయింది కాబట్టి.. మా బీడీల ఫ్యాక్టరీ ఫోటో వైరల్ అవుతోంది. ఇది కొందరు టీడీపీ అంటే గిట్టని వారు చేస్తున్నట్టు భావిస్తున్నాం అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: