ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల కాస్త పొలిటికల్ గా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తరచుగా విమర్శలు గుప్పిస్తూ తానూ ఉన్నాను అనిపించుకుంటున్నారు. అయితే ఆయన వ్యాఖ్యల్లో లాజిక్ లోపిస్తోంది. ఏదో ప్రభుత్వాన్ని విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నాను అన్నట్టుగా తయారైంది పరిస్థితి.


ఇటీవల జగన్ సర్కారు వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించింది. ప్రతి ఆటో డ్రైవర్ కు ఏడాదికి పదివేల రూపాయలు అకౌంట్లో వేశారు. ఈ పథకం నిజంగా ఆటో డ్రైవర్లుకు వరంగా మారింది. అయితే ఈ పథకం అందుకున్నవారి ఆటోలపై సీఎం జగన్ స్టిక్కర్లు అతికిస్తున్నారు. కొందరు అభిమానంతో అతికించుకుంటే.. మరికొన్ని చోట్ల రవాణాశాఖ అధికారులే అంటించారని విమర్శలు వచ్చాయి.


ఈ అంశాన్ని పట్టుకున్నారు కన్నా లక్ష్మీనారాయణ.. ఆటోలకు సీఎం జగన్ స్టికర్లు అతికించడంపైబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా చేస్తే.. "బాబుకు మీకు తేడా ఏముంది జగన్ ? అంటూ సోషల్ మీడియాలో విమర్శించారు. కేంద్ర పథకాలకు చంద్రబాబు స్టిక్కర్ వేశారు. మీరు అంతకు మించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఈ ప్రభుత్వ కార్యాలయాలకు.. మీ పార్టీ రంగులేసి ప్రజా ధనాన్నిదుర్వినియోగం చేశారు. మీకు ఓటు వేసిన పాపానికి కార్మికులను రోడ్డున పడేశారు" అని ట్వీట్ చేశారు.


అయితే ప్రభుత్వ అధికారులు ఆటోలపై స్టిక్కర్లు అతికించడం అభ్యంతరకరమైన విషయమే అయినా అదేమంత నేరం కాదు.. కదా.. 10 వేల రూపాయలు సాయం చేసినప్పుడు.. పది రూపాయల స్టిక్కర్ అంటిస్తే వచ్చిన నష్టం ఏముంది.. అన్న లాజిక్ కన్నా మాటల్లో కనిపించడం లేదు. ఇక్కడ మరో విషయం గమనించాలి. చంద్రబాబు కేంద్రం నిధులతో చేపట్టిన పథకాలను తన పథకాలుగా ప్రచారం చేసుకున్నారు.


కానీ జగన్ అలా కాదు కదా.. ఆయనవి ఆయన పథకాలే.. ఇవి ఏపీ బడ్జెట్ నుంచే చెల్లిస్తున్నారు. అలాంటప్పుడు ఈ విషయంలో జగన్ నూ చంద్రబాబునూ కలిపి ఒకే గాటన కట్టడం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి అంత సబబు కాదని అంటున్నారు విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: