వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ అంధ్ర రాష్ట్రంలో చెక్కుచెదరని ప్రజాదరణతో అందరి కంటే ముందున్నారన్నది తెలిసిన విషయమే. ఈ విషయంలో  ఇంటలిజెన్స్ వర్గాలు సైతం అప్పట్లో జగన్ ఒక్క మాగాడు అంటూ నివేదికలు ఇచ్చాయి. అప్పటి సీఎం చంద్రబాబు గ్రాఫ్ దారుణంగా పడిపోయిన సంగతిని కూడా అవి బయటపెట్టాయి. అయితే సరైన రిపేర్లు చంద్రబాబు తీసుకున్నా సకాలంలో అవి జనాలకు చేరకపోవడంతో జగన్ బంపర్ విక్టరీ కొట్టారు.


ఏకంగా 151 సీట్లు, 22 ఎంపీలను సాధించి ఏపీలో పొలిటికల్ బాహుబలిగా అవతరించారు. మరి జగన్ సీఎం గా నాలుగు నెలల పాలన పూర్తి చేసుకుని అయిదవ నెలలోకి అడుగుపెట్టారు. మరి జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు వరసగా ఒకేసారి అమలు చేస్తున్నారు. అలాగే తన ఎన్నికల హామీలను కూడా చకచకా తీర్చేస్తున్నారు. రేపే ఎన్నికలు అన్న తరహాలో జగన్ పరుగులు పెడుతున్నారు. మరి ఇన్ని రకాలుగా జగన్ కష్టపడుతూంటే ఆయన పొలిటికల్ గ్రాఫ్ ఇంకా ఎక్కువగా పెరగాయి. కానీ ఆశ్చర్యకరంగా ఒక్కసారిగా పది శాతం మేర జగన్ గ్రాఫ్ పడిపోయిందని కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు నివేదికలో పేర్కొన్నాయట. ఇది నిజంగా వైసీపీకి షాకింగ్ పరిణామమే. 


జగన్ కష్టపడుతున్నారు. ఆర్హ్దికంగా పేద రాష్ట్రానికి చేయల్సినది అంతా చేస్తున్నారు, కానీ ఆయన పొలిటికల్ గ్రాఫ్ పడిపోవడం ఏంటి అంటే ఇక్కడ చాలానే కధ ఉందని అంటున్నారు. జగన్ పధకాలు జనాలకు పూర్తిగా చేరువ కావడం లేదని అంటున్నారు. పైగా ప్రచారం కూడా పెద్దగా లేదని అంటున్నారు. క్షేత్ర స్థాయిలో పరిణామాలు  జగన్ కి అవగాహన కావడంలేదని అంటున్నారు. మరో వైపు వైసీపీ ఎన్నికల తరువాత పార్టీగా పడకేసింది, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు సరిగ్గా జనంలోకి వెళ్ళడంలేదని అంటున్నారు. అదే సమయంలో టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం మాత్రం బాగానే వెళ్ళిపోతోంది. పాతిక మంది మంత్రులు ఉన్నా కౌంటర్లు గట్టిగా ఇవ్వడంలో వారు విఫలం అవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.


ఇక అమరావతి, పోలవరం విషయంలో ప్రభుత్వ  తాత్సారం కూడా ఇబ్బందిగా ఉందని అంటున్నారు. అభివ్రుధ్ధిని పక్కన పెట్టడం పైనా విమర్శలు ఉన్నాయి.  ఇసుక కొరత, విద్యుత్ కోతలు, అన్నా క్యాంటీన్ల మూసివేత ఇలా టోటల్ గా చూసుకుంటే జగన్ సర్కార్ నాలుగు నెలల కాలంలో పది శాతం మేర ఇమేజ్ కోల్పోయిందని ఇంటలిజెన్స్ రిపోర్టులు చెబుతున్నాయట. ఓ విధంగా ఆలోచిస్తే  ఇవి డేంజర్ బెల్స్ గా చూడాలి. మరి జగన్ వీటిని పట్టించుకుని రిపేర్లు చేసుకుంటారా. పార్టీని, ప్రభుత్వాని పరుగులు తీయిస్తారా ...చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: