గత రెండు మూడు రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ, వార్డ్ వాలంటీర్ల జీతాలు పెంచారని విపరీతంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సోమవారం రోజు గ్రామ వాలంటీర్ల ప్రధాన కార్యదర్శితో సీఎం జగన్ చర్చలు జరిపిన తరువాత జీతాల పెంపు గురించి అధికారికంగా నిర్ణయం ప్రకటిస్తాడని వార్తలు వినిపించాయి. కానీ వైసీపీ ప్రభుత్వం నుండి జీతాల పెంపు గురించి ఎటువంటి నిర్ణయం వెలువడలేదు. 
 
ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం మేరకు గ్రామ, వార్డ్ వాలంటీర్ల జీతాల పెంపు గురించి వస్తున్న వార్తలు నిజం కాదని తెలుస్తోంది. గ్రామ, వార్డ్ వాలంటీర్లు ఉద్యోగాలలో చేరి ఇంకా రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. ప్రభుత్వం నుండి జీతాలు పెంచాలనే ఉద్దేశం ఉన్నట్లు కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. కాబట్టి గ్రామ, వార్డు వాలంటీర్ల జీతాల పెంపు గురించి వస్తున్న వార్తలు అవాస్తవం అని తెలుస్తోంది. 
 
వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజల ఇంటి దగ్గరకు చేర్చాలనే ఆలోచనతో గ్రామ, వార్డ్ వాలంటీర్లను నియమించుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,85,000 గ్రామ, వార్డ్ వాలంటీర్లు సేవలు అందిస్తున్నారు.  ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున ప్రభుత్వం గ్రామ, వార్డ్  వాలంటీర్లను ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేసింది. 
 
ఇప్పటికే గ్రామాల్లో గ్రామ, వార్డ్ వాలంటీర్ల సేవలు ప్రారంభయ్యాయి. గ్రామ సచివాలయాల సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తరువాత   గ్రామ, వార్డ్ వాలంటీర్ల సేవలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వం ప్రస్తుతం గ్రామ, వార్డ్ వాలంటీర్లకు గౌరవ వేతనం కింద 5,000 రూపాయలను చెల్లిస్తోంది.ఆగస్టు, సెప్టెంబర్ గౌరవ వేతనాలు ఈ నెల మొదటివారంలో గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఖాతాలలో జమ అయ్యాయి. భవిష్యత్తులో గ్రామ, వార్డ్ వాలంటీర్లకు జీతాలు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: