తమ డిమాండ్లను సాధించుకునే క్రమంలో చేపట్టిన సమ్మెను కొనసాగిస్తూ..ఆర్టీసీ కార్మికులు విధులకు దూరంగానే ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజా పరిణామాలను భేరీజు వేసుకుంటూ లక్ష్య సాధనలో రాజీలేని ధోరణిలో ముందుకు సాగుతున్నారు. భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించనున్న యూనియన్లు సెల్ఫ్‌ డిస్మిస్‌ అయ్యారని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం చేసిన ప్రకటనను తీవ్రంగా పరిగణిస్తున్నారు. 
ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరుకాకుండా సెల్ఫ్‌ డిస్మిస్‌ అయ్యారని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. సమ్మె పై ఆర్టీసీ కార్మికులకు విపక్షాలు అండగా నిలిచాయి. ప్రభుత్వ చర్యను విపక్షాలు తప్పుబట్టాయి.



నిన్న పండుగ రోజున ఆందోళనకు విరామమిచ్చిన యూనియన్లు.. విపక్షాల మద్దతుతో రౌండ్‌టేబుల్‌ నిర్వహించాలని నిర్ణయించాయి. బుధవారం ఉదయం ఆర్టీసీ కార్మికులు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. సమ్మె పై లీగల్‌ నోటీసు, భవిష్యత్‌ కార్యాచరణ పై సమావేశంలో చర్చ సాగనుంది. ఆర్టీసీ కార్మికులకు ఇప్పటివరకు సెప్టెంబర్‌ జీతం కూడా రాలేదు. ప్రభుత్వ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోని కార్మికులు విధులకు హాజరు కావడం లేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలనే దానిపై చర్చ సాగనుంది. అఖిలపక్ష సమావేశం అనంతరం భవిష్యత్‌ కార్యాచరణను యూనియన్లు ప్రకటించనున్నాయి.  



తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఐదో రోజుకు చేరుకున్న తరుణంలో కీలకమైన చర్చలు కొనసాగుతున్నాయి. ఒక పక్క ఆర్టీసీ జేఏసీ అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహిస్తుంది. మరో పక్క ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా పరిణాలను అధ్యనం చేస్తున్నారు. ఈ క్రమంలో సంబంధిత అధికారులతో సమీక్షిస్తూ.. తెసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మార్గ దర్శకం చేస్తున్నారు. ఇదిలా ఉండగా  ప్రభుత్వంతో ఆర్టీసీ అధికారులు సమావేశం కానున్నారు. ఆర్టీసీ      సమ్మెపై అఖిలపక్షాలు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వేదికగా  చర్చలు జరుగుతున్నాయి.  మరోవైపు పూర్తి కార్యాచరణకు కార్మిక సంఘాల జేఏసీ సిద్ధమవుతోంది, ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీల సలహాలు, సూచనలను తీసుకుంటున్నట్టు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: