బిజేపిలో అంత ఊపు లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు.ఏదో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా మారడం, ప్రతిపక్షాల నుంచి అడ్డగోలుగా ఎమ్మెల్యేలను చేర్చేసుకోవడం, విపక్షం బలహీనతతో మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీ బయటపడాల్సిందే కానీ..ఇదివరకటి అంత ఊపులేదు అని అంటున్నారు.  మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మెరుగైన అవకాశాలు ఉన్నప్పటికీ  చతికిల పడుతుందని వారు పేర్కొంటున్నారు.


ప్రత్యేకించి మహారాష్ట్రలో అయితే ఒక దశలో 170 సీట్లకు పోటీ చేయాలని అనుకున్న భారతీయ జనతా పార్టీ, చివరకు 150  సీట్లకే తగ్గిందట. ఇదంతా ఆ పార్టీ బలహీనతే అని అంటున్నారు విశ్లేషకులు. అంతేకాకుండా మహారాష్ట్రలో ఇప్పటికే ఎన్సీపీ, కాంగ్రెస్ ల నుంచి బోలెడంత మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంది భారతీయ జనతా పార్టీ. ఇదివరకు ఏపీలో చంద్రబాబు నాయుడు చేర్చుకున్న రీతిన అక్కడ ఎమ్మెల్యేలను చేర్చుకుంది కమలం పార్టీ.  అలా ప్రతిపక్షాన్ని దెబ్బతీసే వ్యూహాన్ని నమ్ముకుందట. ఎలాగూ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నాయకత్వమే అద్వాన్నంగా ఉంది కాబట్టి ఇది బిజేపికి కలసి వస్తుందంటున్నారు విశ్లేషకులు.


ఇకపోతే, శివసేనకు అదనంగా ఇరవై సీట్లను కేటాయించిందట కమలం పార్టీ  ఇక ఇప్పుడున్న పరిస్దితిలో రాహుల్ పార్టీకి పునరుత్తేజాన్ని ఇవ్వడం మాట అటుంచుతే, తను డిప్రెషన్లోకి  వెళ్లిపోయినట్లుగా ఉన్నాడని అనుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఇక దేశంలో పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ హై కమాండ్ ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. దానికి కారణం బీజేపీ పై ఏదో ఒక రోజు ప్రజలకు విరక్తి రాకపోదా.. తమకు ఓట్లు పడకపోవా అన్న ఆశతో ఉన్నట్టుగా ఉంది ఆ పార్టీ పరిస్థితి. ఇదే కమలం పార్టీకి ఇప్పుడు ఉపశమనం కాబోతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక అక్టోబర్ 21న ఓటింగ్ జరుగనుండగా, 24 న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: