మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతున్న కొద్ది అభ్యర్ధుల్లో హడావుడి కనిపిస్తుంది..ఇక ఈ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 21న జరగనుండగా... 24న ఫలితాలు రానున్నాయి. టైమ్ తక్కువగా ఉండటంతో... అధికార బీజేపీ, శివసేన వేగంగా పావులు కదుపుతున్నాయి. 288 సీట్లు ఉన్న అసెంబ్లీలో ఈసారి బీజేపీ 144 సీట్లలో పోటీ చేయనుంది... శివసేన 126 స్థానాల్లో బరిలో దిగనుంది. మిగతా 18 స్థానాల్లో చిన్న మిత్రపక్షాలు పోటీచేయనున్నాయని తెలిసింది.


బీజేపీ చెబుతున్నదాని ప్రకారం... శివసేనకు ఈసారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి దక్కబోతోందని తెలుస్తోంది. ఈసారి రెండు పార్టీలూ కలిసి పోటీచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించడంతో... సీట్ల సర్దుబాటుకి పార్టీలు సిద్ధమైనట్లు తెలిసింది.ఇకపోతే మహారాష్ట్రలో ఎన్నికల్లో పోటీనుంచి ఒక నాయకుడు విరమించారు. దేశంలోనే సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేగా ఉన్న గణపతిరావు దేశ్‌ముఖ్‌ రాజకీయాల నుంచి సెలవు తీసుకున్నారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది


పీజంట్స్‌ అండ్‌ వర్కర్క్స్‌ పార్టీకి చెందిన గణపతిరావు దేశ్‌ముఖ్‌ ఎన్నికల్లో పోటీ చేయకూడని నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికీ ఇంకా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్న గణపతిరావు వయస్సు 93 సంవత్సరాలు. మహారాష్ట్రలో 59ఏళ్ల పాటు శాసనసభ్యుడిగా కొనసాగిన ఈయన ఈ వయస్సులో పోటాపోటిగా ఉరుకులు పరుగులతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, క్షేత్రస్థాయిలో జరుగుతున్న రాజకీయాల వంటివాటితో విసిగిపోయి ఎన్నికల్లో పాల్గొన కూడదని నిర్ణయించుకున్నారని తెలిపారట.


ఇక  1962లో మొదటిసారిగా ఎన్నికల్లో  సోలాపూర్‌ జిల్లా సంగోలా నుంచి విజయం సాధించిన గణపతిరావు ఇప్పటి వరకూ 11సార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించారు. మంత్రిగా కూడా పని చేశారు. ఇకపోతే రాజకీయాల్లో డిఎంకె అధినేత ఎం కరుణానిధి తరువాత అత్యధిక కాలం చట్టసభ్యుడిగా కొనసాగిన రెండవ నేతగా గణపతిరావు గుర్తింపు పొందారు...

మరింత సమాచారం తెలుసుకోండి: