తెలంగాణలో ఆర్టీసీ సమ్మె అయిదో రోజుకు చేరింది. ఈ రోజు నుండి సమ్మెను ఉధృతంజరుగుతుంది. ఇదే సమయంలో దీనిని రాజకీయంగా తమకు అనుకూలగా మలచు కొనేందుకు..ప్రభుత్వం పైన పై చేయి సాధించేందుకు ప్రతిపక్షాలు దీనిని అవకాశంగా మార్చుకుంటున్నాయి. అందులో భాగంగా నేడు  అఖిల పక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక వైపు ప్రభుత్వం ఉద్యోగులు సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నారంటూ ముఖ్యమంత్రి చెబుతున్నారు. ప్రయివేటు భాగస్వామ్యం తప్పదని స్పష్టం కూడా చేసారు. పదో తేదీన కోర్టు ముందు ఈ అంశం ఇంకో సారి చర్చ కూడా జరుగుతుంది.


ఇక, అన్ని జిల్లాల్లో కలెక్టర్లు డిపోల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రితో మరోసారి ఆర్టీసీ అధికారులు సమావేశం అవుతున్నారు. ఇలా..రాజకీంగా.. న్యాయ పరమైన అంశాలతో ఈ సమ్మె కొత్త టర్న్ తీసుకుంటోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ వైఖరి పైన చర్చించి..భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసేందుకు ఆర్టీసీ జేఏసీ అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. 


తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అధ్యక్షతన జరిగే.. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నేతలను జేఏసీ ఆహ్వానించింది. అన్ని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ఈ సమావేశంలో పాల్కొన్నారు.  ఇతరత్రా అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో... ఈ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాల ఆధారంగా ప్రభుత్వ వైఖరి స్పష్టం కానుంది.


ఇక, ఇప్పటి వరకు తీవ్ర హెచ్చిరికలతో పాటుగా ప్రయివేటు భాగస్వామ్యం ఆర్టీసీలో తప్పదని స్వయంగా ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. దీంతో..ఇప్పుడు ఈ అఖిలపక్ష సమావేశం ద్వారా ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తేవటం..సమ్మెను తీవ్రతరం చేసే దిశగా కార్యాచరణ సిద్దం.  అయితే, ప్రభుత్వం సైతం చివరి నిమిషం వరకు కార్మికులకు దారిలోకి తెచ్చుకొనే ప్రయత్నాలకే ప్రాధాన్యత ఇస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: