రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకే పరిమితం అయిన మెగాస్టార్ చిరంజీవితో వైసీపీ పరోక్ష సంబంధాలు కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో చంద్రబాబుకే మైండ్ బ్లాక్ అయ్యేలా సోషల్ ఇంజనీరింగ్.. పోల్ మేనేజ్ మెంట్ చేసిన వైసీపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత  అదే రకంగా వ్యవహరిస్తోంది.  చిరంజీవి తాజాగా తాడేపల్లి గూడెంలో ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం మొత్తం వైసీపీ కాపు నేతల ఆధ్వర్యంలోనే జరిగింది.  వారిని చిరంజీవి సైతం అభింనదనలలో ముంచెత్తారు.


 ఇదంతా..పవన్ ను రాజకీయంగా దెబ్బ తీసేందుకు వైసీపీ ఎంచుకున్న కొత్త వ్యూహమా అనే చర్చ మొదలైంది.   సైరా సినిమా ప్రమోషన్ అనుమతులను చిత్ర నిర్మాతలు సీఎం జగన్ సొంత మీడియాకు అప్పగించారు.  అదే విధంగా సాహో సినిమాకు ఏపీలో స్పెషల షోలకు అనమతి ఇవ్వని జగన్ ప్రభుత్వం..తాజాగా సైరా సినిమాకు మాత్రం అర్దరాత్రి నుండి తెల్లారి 10 గంటలకు వరకు ఏకంగా ఆరు షోలకు చివరి నిమిషంలో అనుమతి ఇచ్చింది. ఇక, చిరంజీవి తాడేపల్లి గూడెం పర్యటనలో వైసీపీ నేతలు చాలా క్లోజ్ గా చిరంజీవితో ఉండటం రాజకీయంగా చర్చకు కారణమైంది.


అయితే, ఆ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే..కాంగ్రెస్..బీజేపీ నేతలు ఉన్నారు. వైసీపీ నేతలు ప్రముఖ పాత్ర పోషించారు.  కానీ, ఎక్కడా జనసేన నేతలు మాత్రం కనిపించలేదు. అధికారంలో ఉన్న సమయంలో ఫెద్దగా చిరంజీవి గురించి స్పందించని టీడీపీ అధినాయకత్వం ఎన్నికల్లో ఓడిన తరువాత చిరంజీవి పైన ఆసక్తి చూపిస్తోంది.  ఆగస్టులో చిరంజీవి జన్మదినాన టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పగా..మాజీ మంత్రి లోకేశ్ ఒక అడుగు ముందకేసి ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తారు.

 

చిరంజీవి రాజకీయాలకు దూరమైనా.. ఆయన మీద సినీ అభిమానం మాత్రం చెక్కు చెదర్లేదని వైసీపీ నేతల అంచనా.  ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో గత ఎన్నికల్లో పట్టు సాధించి..స్వయంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ గెలుపొందిన వైసీపీ అదే పట్టు కొనసాగించాలని భావిస్తోంది. 
. అందులో భాగంగానే అక్కడి నేతలను తమ పార్టీలో చేర్చుకొనేందుకు ప్రాధాన్యత ఇస్తోంది.
 చిరంజీవి రాజకీయాల్లో లేరు కాబట్టి..ఆయనతో సఖ్యతగా ఉన్న సంకేతాలు ఇవ్వటం ద్వారా మెగా అభిమానుల మద్దతు పొంది..పరోక్షంగా పవన్ కళ్యాన్ ను దెబ్బ తీయవచ్చనేది వీరి అంచనాగా చెబుతున్నారు. అయితే.. మరి కొద్ది రోజులుగా చిరంజీవి అంశాల్లో సానుకూలంగా..దగ్గరగా వ్యవహరిస్తున్న వైసీపీ నేతలకు ఇది రాజకీయంగా ఏ మేర ప్రయోజనం కలిగిస్తుందనేది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: