తెలంగాణలో నిరుద్యోగులకు విద్యుత్ శాఖ శుభవార్త చెప్పింది. TSSPDCL(తెలంగా రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ)లో 3,025 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో జూనియర్ లైన్‌మెన్- 2500, జూనియర్ పర్సన్ ఆఫీసర్స్ (JPO) పోస్టులు 25, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్స్-500 పోస్టులు ఉన్నాయి. 

            

పోస్టుల వివరాలు.. 

         

జూనియర్ లైన్ మెన్ 2500 

          

జూనియర్ పర్సనల్ ఆఫీసర్ 25 

         

జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ 500 

         

మొత్తం పోస్టులు 3,025 

           

కాగా ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అక్టోబరు 10న (రేపు)వెలువడనుంది. రేపటి నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రకటన ప్రకారం తెలంగాణ విద్యుత్ శాఖలో ఇప్పటికే 2,939 ఖాళీలు భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ప్రస్తుత పోస్టులకు అదనంగా 86 ఉద్యోగాలను జతచేసి మరో నోటిఫికేషన్ రేపు విడుదల చేయనుంది. 

           

ఏది ఏమైనా తెలంగాణాలో నిరుద్యోగులకు శుభవార్త మీద శుభవార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మండిపడ్డ కేసీఆర్ సమ్మె చేసిన కార్మికులను ఉద్యోగం నుంచి తొలిగిస్తున్నట్టు వారి స్థానంలో కొత్త ఉద్యోగులను తీసుకుంటున్నట్టు ప్రకటించింది. కాగా ఇప్పుడు విద్యుత్ శాఖలో 3025 ఉద్యోగాలు కాలిగా ఉన్నాయి. అయితే ఉపఎన్నికల కారణంగా సూర్యాపేట జిల్లా మినహా మిగతా జిల్లాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. కాగా రేపే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభంకానుంది.

            

మరింత సమాచారం తెలుసుకోండి: