మనం ఏదైనా వ్యాధి వస్తే  డాక్టర్ ని  సంప్రదిస్తాం . ఆ వ్యాధి నయం అవుతుందని చెప్పి డాక్టర్ ఏ మందు ఇచ్చిన వేసుకుంటాం . అయితే డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకోవడం వల్ల ఉన్న సమస్యను నయం అవ్వడం దేవుడెరుగు కానీ కొత్త సమస్య పుట్టుకొస్తే. డాక్టర్ ఇచ్చిన మందుల వల్ల మన బాడీ లోని అవయవాల్లో మార్పులు వస్తే. అలా ఎందుకు జరుగుతుంది అంటారా... కానీ ఇక్కడ ఒక వ్యక్తికి మాత్రం అలాగే జరిగింది. ఓ వ్యాధి తో  బాధపడుతూ ఓ వ్యక్తి  డాక్టర్ దగ్గరికి వెళ్లగా  డాక్టర్ ఇచ్చిన మందుతో ఆ వ్యక్తికి మహిళలలాగా వక్షోజాలు పెరగడం మొదలయ్యాయి . దీంతో షాక్ అయినా ఆ వ్యక్తి కోర్టులో కేసు వేయగా... భారీ నష్టపరిహారం పొందడు. 

 

 

 

 

 పెన్సిల్వానియా కు చెందిన నికోలస్ ముర్రే  అనే వ్యక్తి ఆటిజం స్పెక్ట్రం అనే వ్యాధితో బాధపడుతున్నాడు. దీనికోసమే ఓ సైకాలజిస్ట్ ని  సంప్రదించాడు ఆ వ్యక్తి. అయితే నికోలస్ ముర్రెని   పరీక్షించిన సైకాలజిస్ట్ రిస్పెర్డాల్  అనే  ఓ మందుని  ప్రిఫర్ చేసాడు. అయితే నికోలస్ కొన్ని రోజులు ఆ మందు వాడిన తర్వాత అతని చెస్ట్ భాగంలో మార్పులు రావడం మొదలయ్యాయి. రాను రాను మహిళల వక్షోజాలు లాగ పెరిగిపోయాయి. దీంతో షాక్ కి గురైన నికోలస్ ఆ మందులు వాడడం వల్ల మహిళలు లాగా  పురుషుల్లో వక్షోజాలు పెరుగుతాయని  సంస్థ హెచ్చరించింద లేదని ... వృక్షోజాలు పెరగడం తో మనోవేదనకు లోనయ్యాను అంటూ   ఆ మందును  ఉత్పత్తి చేసినా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ పై కోర్టులో దావా వేశాడు నికోలస్ . 

 

 

 

 

 

 అయితే ఈ కేసును విచారించిన ఫిలడెల్ఫియా కోర్టు ... సంచలన తీర్పునిచ్చింది. బాధితుడికి భారీ పరిహారం చెల్లించాలని సూచించింది. ఏకంగా 59,963 కోట్ల పరిహారంగా విధించింది అక్కడి కోర్టు. అయితే కోర్టు విధించిన పరిహారం పై అభ్యంతరం వ్యక్తం చేసింది  జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ... పరిహారం చెల్లించాలని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోర్టుని  కోరింది. కోర్టు తీర్పు వల్ల ఇప్పటికే తమ సంస్థకు భారీ నష్టం వాటిల్లిందని సంస్థ యాజమాన్యం తెలపింది . అయితే ఇప్పుడు వరకు కోర్టు ఇచ్చిన తీర్పును మాత్రం వెనక్కి తీసుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: