తెలుగు రాజకీయాల్లో కలకలం టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ అరెస్ట్. ఆయన దేశ నాయకులను సైతం ముఖాముఖీ ఇంటర్వ్యూలు చేసి అదరగొట్టేవారు. తన వాడి వేడి మాటలతో బెదరగొట్టేవారు. మీడియా టైకూన్ గా హవా చలాయించిన రవిప్రకాష్ ఈ రోజు కటకటాల వూచలు లెక్కబెడుతున్నారంటే అది ఆయన స్వయంక్రుతమేనని అంటున్నారు. ఓ సాధారణ రాజకీయ వార పత్రికలో సీనియర్ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్ శిష్యరికంలో జర్న‌లిజం ఓనమాలు దిద్దిన రవిప్రకాష్ అనతికాలంలోనే దేశంలోని మీడియా రంగంలోనే సంచలనాలు  నమోదు చేసే స్థాయికి ఎదిగారు.


ఆ సమయంలో రాజకీయ పార్టీలను, పెద్దలను వణికించిన చరిత్ర ఆయనకే సొంతం. బలమైన మీడియాతో ఫోర్ట్ ఎస్టేట్ ని నిజంగా కంచుకోటగా చేసుకుని రాజ్యమేలిన రవిప్రకాష్ ఇంత సీనియర్ పాత్రికేయుడైనా రాజకీయాలు ఎపుడూ ఒకేలా ఉండవన్న సింపుల్ లాజిక్ ని మిస్ అయ్యారు. ఫలితంగా ఆయన ఇప్పుడు జైల్ పాలయ్యారు. సరే రవిప్రకాష్ మీద ఒక్కో కేసు బయటకు వస్తోంది. ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.  ఓ విధంగా చెప్పాలంటే  ఆయన వూబిలోకి దిగిపోయారు. ఇక మీడియాలో వుంటూ రాజకీయాలను శాసిస్తున్న వారు ఎవరు, వారి కధేంటి, రవిప్రకాష్ పక్క సీటు ఎవరికి ఇదీ ఇపుడు వాడిగా వేడిగా చర్చ సాగుతోంది.



ఏపీలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగానూ, ఆ పార్టీకి ఆంతరంగికుడిగానూ  ఉంటూ అయిదేళ్ళ నవ్యాంధ్ర పాలనలో  గరిష్ట లాభాలు పొందిన ఓ మీడియా అధిపతి మీద ఇపుడు అందరి చూపు ఉందని అంటున్నారు. ఆ మీడియా అధిపతి తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘమైన అనుబంధం కలిగిఉండడమే కాదు, ముఖ్యసలహాదారుగా మారి బీజేపీకి, టీడీపీకి మధ్య సంబంధాలు చెడగొట్టడంలో కీలకమైన పాత్ర పోషించారట.


అదే విధంగా ఆయనకు సొంత సామాజికవర్గం అంటే విపరీతమైన ప్రేమ అంటారు. ఇక బీజేపీని, మోడీని దారుణంగా ఇటీవల ఎన్నికల్లో నిందించడమే కాదు, ప్రస్తుత హోం మంత్రి అమిత్ షాను సైతం వదలలేదని చెబుతున్నారు. ఇన్ని రకాలుగా తమకు డ్యామేజ్ చేసిన ఆ మీడియా అధిపతి విషయంలో కమలం పార్టీ కన్నెర్ర చేస్తోందని అంటున్నారు.  ఆ మీడియా మోతుబరిదే రవిప్రకాష్ పక్క సీటు అంటున్నారు. చూడాలి మరి. అదే జరిగితే ఏపీ రాజకీయాలతో పాటు, మీడియా రంగంలోనూ పెను సంచలనమే నమోదు అవుతుందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: