ఏపీ రాజకీయాల్లో తెలుగుదేశం పాత్రను కొట్టిపారేయడానికి వీలులేదు. ఎన్టీయార్ ఏ ముహూర్తాన టీడీపీ అన్న పేరిట పార్టీని ప్రకటించారో ఆ ముహూర్త బలం చాలా గట్టింది. అందుకే నలభై ఏళ్ళ పాటు టీడీపీ ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని నిలబడింది. అయితే టీడీపీకి ఇపుడు నడివయసులోనే వార్దక్యం వచ్చేసింది. మధ్యాహ్నం ఉండగానే పడమర వైపు పార్టీ పరుగులు తీస్తోంది. టీడీపీని నిన్నా ఇవాళా చూసిన వారి ఇక బతికి బట్టకట్టడం కష్టమని గట్టి విశ్వాసంతో ఉన్నారు.


చంద్రబాబు 45 ఏళ్ల వయసులో టీడీపీకి సారధ్యం వహించి 70 ఏళ్ల వరకూ అంటే పాతికేళ్ల పాటు బాగానే లాగారు. ఇపుడు మరో అయిదేళ్ళు పార్టీని లాగడం అంటే బాబు శక్తికి మించిన పని. ఆయన వయసు అప్పటికి 75 ఏళ్లకు చేరుకుంటుంది.  ఆనాటికి జగన్ మంచి వయసులో రాజకీయం రాటుదేలి కూడా ఉంటారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లోనూ వ్రుధ్ధుడిగా ఉన్న బాబుని, జగన్ని పోల్చి చూసి జనం  కచ్చితంగా జగన్నే ఎన్నుకుంటారు. ఎందుకంటే 2014 నాటి ఫార్ములానే వారు అనుసరిస్తారు కాబట్టి. మరి టీడీపీకి దిక్కెవరు, దాన్ని నమ్ముకున్న బలమైన సామాజికవర్గానికి రాజకీయ భరోసా ఏది.


అందుకే ఆ వర్గం నేతలు కొంతమంది జూనియర్ ఎన్టీయార్ ఇంటి తలుపు తడుతున్నారుట. బాబూ తాత గారి పార్టీని నీవైనా కాపాడాలని గట్టిగా కోరుతున్నారుట. చంద్రబాబుకు వయసు అయిపోయింది. ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. లోకేష్ పార్టీని నడిపించలేడు అంటున్నారు. ఈ నేపధ్యంలో జూనియర్ ముందుకు వచ్చి టీడీపీ జెండా పట్టుకోవాలని కోరుతున్నారుట. మరి ఇపుడే సినిమాల్లో బాగా నిలదొక్కుని మంచి ఫ్యూచర్ కలిగి ఉన్న జూనియర్ ఈ నేతల మాటలకు పడిపోయి రాజకీయాల్లోకి వస్తారా అన్నది చూడాలి. ఒకవేళ జూనియర్ వచ్చినా టీడీపీకి గత ప్రాభవం వస్తుందా అని కూడా మరికొందరు అంటున్నారు. మొత్తానికి టీడీపీ ఓటమి సొంత సామాజికవర్గంలో పెద్ద కలవరమే రేపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: