మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు అక్టోబర్ 21 వ తేదీన జరగబోతున్నాయి.  ఈ ఎన్నికల్లో గెలవాలని అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి.  ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలో ఉన్నది.  రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా ముందస్తు సర్వేలు చెప్తున్నాయి.  సర్వేలను అనుసరించే ప్రచారం కూడా జరుగుతున్నది.  ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి.  


బీజేపీ, శివసేనల కలిసి మహారాష్ట్రలో పోటీ చేస్తున్నాయి.  రెండు పార్టీలు పద్దతి ప్రకారం ప్రచారం చేస్తున్నాయి.  అంతేకాదు, రెండు పార్టీల నేతలు ఎన్నికల హామీలను కూడా ప్రచారం చేసుకుంటున్నారు.  బీజేపీ ముఖ్యంగా జాతీయ భద్రతా, ఎన్ఆర్సి, ఉద్యోగాలు, డిజిటల్, రైతు పధకాలపై ప్రచారం చేస్తున్నది.  అదేవిధంగా జాతీయ స్థాయిలోని నేతలైన ప్రధాని మోడీ, అమిత్ షాలు మహారాష్ట్రలో ప్రచారం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.  


మోడీ 10 సభల్లో పాల్గొనబోతున్నారు.  అమిత్ షా మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.  రెండు రాష్ట్రాల్లో అయన ప్రచారం చేయబోతున్నారు.  ఈ రెండు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో తిరిగి అధికారం నిలబెట్టుకోవడనికి బీజేపీ ప్రయత్నం చేస్తుంటే.. అటు కాంగ్రెస్ పార్టీ కనీసం కాస్త మెరుగ్గా రాణించేందుకు కృషి చేస్తున్నది. కేంద్రంలోని మంత్రులు, నేతలు ప్రతి ఒక్కరు పార్టీ గెలుపుకోసం ప్రచారం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.  


బీజేపీలో ఉన్న నాయకులు దాదాపుగా పార్టీ మారే స్వభావం ఉన్న వ్యక్తులుగా ఉండరు.  మొదటి నుంచి బీజేపీలో ఉన్న నేతలు పార్టీ మారేందుకు అసలు ఒప్పుకోరు.  వారికీ సంఘ్ సపోర్ట్ కూడా ఉండటంతో నిత్యం బీజేపీతోనే ఉంటున్నారు.  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా చాలామంది కాంగ్రెస్ ను వదిలి వచ్చేందుకు ఇష్టపడరు.  కొందరు నేతలు మాత్రం పార్టీలు మారేందుకు సిద్ధం అవుతుంటారు. అలంటి వ్యక్తులు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంటారు.  పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీతో ఉండి పార్టీ అధికారం కోల్పోయిన తరువాత మరో పార్టీలోకి వెళ్లే వ్యక్తులతో ఎప్పటికైనా ఇబ్బందే అని చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: