ఆగష్టు 5 వ తేదీ అంటే ఇప్పుడు అందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.  ఆరోజున జమ్మూ కాశ్మీర్ లో పూర్తిస్థాయిలో భద్రతా బలగాలు మోహరించాయి.  భద్రతను కట్టుదిట్టం చేశారు. కర్ఫ్యూ వరణం నెలకొన్నది.  జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టే ఆర్టికల్ 370 రద్దు చేశారు.  అలజడులు జరగకుండా ముందుజాగ్రత్తగా భద్రతను పెంచారు.  తరువాత మెల్లిగా ఒక్కోచోట ఒక్కోచోట ఆంక్షలను సడలిస్తూ వస్తున్నారు.  


ఇప్పుడు అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది.  జమ్మూ కాశ్మీర్లో నేతలను ఆగష్టు 5 వ తేదీన గృహనిర్బంధం చేసింది.  వేరు బయటకు వస్తే రెచ్చగొడతానే ఉద్దేశ్యంతో కేంద్రం ఆ నిర్ణయం తీసుకుంది.  ఇప్పుడు పరిస్థితులు అదుపులోకి రావడంతో వారిని గృహనిర్బంధం నుంచి విడిచిపెట్టింది.  ఇప్పుడు అక్కడి భద్రత కేంద్రం అధీనంలో ఉన్నది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలిగించినా కేంద్రం వారిని అదుపులోకి తీసుకుంటుంది.  తప్పుచేస్తే పోలీసులు అక్కడి వ్యక్తులను అదుపులోకి తీసుకునే స్వేచ్ఛ ఉన్నది.  


దీంతో అక్కడి ప్రజలు సైలెంట్ గా ఉంటున్నారు.  పైగా ఇప్పుడు కేంద్రం అక్కడ అభివృద్ధి కోసం బ్లూ ప్రింట్ ను ఏర్పాటు చేసింది.  అభివృద్ధికి నిధులు కేటాయిస్తోంది.  పరిశ్రమలు నెలకొల్పేందుకు సిద్ధం అయ్యింది.  పెద్ద ఎత్తున అక్కడ ఉద్యోగాల కల్పనను తీసుకొస్తోంది.  ఫలితంగా ప్రజలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు.  టూరిజం అభివృద్ధి చెందుతుంది .  కాబట్టి ప్రజలకు ఇబ్బందులు ఉండవు.అంతేకాదు, అక్కడి భద్రతా బలగాలకు కూడా పూర్తి స్వేచ్ఛ ఉన్నది.  ఒకప్పుడు ప్రజలు వాళ్ళను హింసించినా కేసులు లేవు.  ఇప్పుడు తేడా వస్తే కేసులు పెడతారు.  అరెస్ట్ చేస్తారు.  దీంతో ప్రజలు సైతం పెద్దగా గొడవలు చేయడానికి ఆసక్తి చూపడంలేదు.  


60 రోజుల తరువాత పరిస్థితులు అదుపులోకి వచ్చాయని, అదుపులోకి తీసుకురావడమే కాకుండా జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి కోసం కేంద్రం కట్టుబడి ఉందని చెప్పడంతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు అక్కడ పరిస్థితులు అదుపులో లేవని చెప్తూ వస్తున్నా.. అలాంటిది ఏమి లేదని, పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని కేంద్రం చెప్తున్నది.  ఆంక్షలను ఎత్తివేయడం వెనుక రెండు రాష్ట్రాల ఎన్నికలు కూడా ఒక కారణం అని చెప్పొచ్చు.  దీన్ని బీజేపీ బలంగా వాడుకునేలా కనిపిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: