రోజు రోజుకీ బంగారం ధరలు పైపైకి ఎగబాకుతోన్నాయి. ఈ రోజు తాజాగా మళ్లీ  పసిడి పరుగులు పెట్టింది. ఇకపోతే హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర పైకి కదిలింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 పెరిగగా. ఈ దెబ్బతో ధర రూ.39,980కు చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో బలమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడం బంగారం ధరపై సానుకూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.


ఇకపోతే అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర రూ.360 పెరుగుదలతో రూ.36,650 కు చేరింది. ఇక పసిడి ధర పరిగెడితే.. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగింది. కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.48,500 వద్దనే స్థిరంగా ఉంది. ఇక ఢిల్లీ మార్కెట్‌లో గమనిస్తే పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరుగుదలతో రూ.38,500కు చేరుకోగా, అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.400 పెరిగింది. దీంతో ధర రూ.37,450కు పరుగులు పెట్టింది.ఇక్కడ కూడా బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగింది. కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.48,500 వద్దనే స్థిరంగా ఉంది.


పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌‌ లేకపోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో కూడా బంగారం ధర పైకి కదిలింది. పసిడి ధర ఔన్స్‌కు 0.10 శాతం పెరుగుదలతో 1,514.30 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.19 శాతం పెరుగుదలతో 17.84 డాలర్లకు ఎగసింది. ఇక ఈ మద్యకాలంలో బంగారం ధర ఇంతలా  పెరుగుతూ పోవడం కొందరు పసిడి ప్రియులను కలవర పెడుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: