టీఎస్ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె హుజూర్‌నగర్ ఉప ఎన్నికలపైన ప్రభావాన్ని చూపనున్నాయి. ఈ ఎన్నికల  బరిలో 28 మంది అభ్యర్ధులు తమ తమ బలబలాలను  నిరూపించేందుకు అన్ని విధాలుగా సిద్ధమయ్యారు. ఈ ఉపఎన్నికను అధికార-విపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అయితే తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే అవుననే అనిపిస్తుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో మద్దతు ఉపసంహరించుకునే ఆలోచనలో సీపీఐ పడింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజు కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకు ముందే మద్దతు ప్రకటించిన సీపీఐకి హుజూర్ నగర్ ఉప ఎన్నికల విషయంలో అధికార టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చి తప్పు చేశామని అర్ధం అయ్యినట్టుంది.



అందుకే సీపీఐ తన మద్దతు కార్మికుల విషయంలో ప్రభుత్వం ఇలాగే ప్రవర్తిస్తే ఉప సంహరించుకునే ఆలోచనలో ఉంది. సీపీఐ టీఆర్ఎస్ కు ఇచ్చిన ఈ మద్దతుపై పునరాలోచన చేయనుంది. హుజూర్‌ నగర్‌ లో తమ అభ్యర్థికి మద్దతివ్వాల్సిందిగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సీపీఐని కోరింది. దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ కూడా సీపీఐ మద్దతు కోరుతుండడంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారే ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థికి మద్దతివ్వాల్సిందిగా సీపీఐకి కోరనుంది కాసేపట్లో టీ-కాంగ్రెస్‌ బృందం సీపీఐ కార్యాలయానికి వెళ్లనుంది. టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి నేతృత్వంలోని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కోదండ రెడ్డి, ప్రసాద్ కుమార్ బృందం చాడా వెంకటరెడ్డితో సమావేశం కానున్నారు. 
 



తెలంగాణా రాష్ట్రంలో సీపీఐ తాజా పరిణామాల నేపధ్యంలో అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్న సీపీఐ యూ టర్న్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది . హుజూర్ నగర్ ఎన్నికల్లో అధికార పార్టీకి తమ మద్దతు ప్రకటించిన సీపీఐ నేతలు ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో ఆత్మ పరిశీలనలో పడ్డారు. అందుకే ఇప్పటికైనా కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా ఉండాలని లేని యెడల అధికార పార్టీకి మద్దతుపై పునరాలోచిస్తామని సంకేతాలిస్తున్నారు. మొదటి నుండి కార్మిక పక్షపాతిగా ఉన్న సీపీఐ నేతలు ఆర్టీసీ కార్మికులకు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. ఇక హుజూర్ నగర్ ఎన్నికల్లో మద్దతు రాజకీయ అవసరం అని ముందు పేర్కొన్నప్పటికీ ఇప్పుడు మాత్రంఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో యూటర్న్ తీసుకునే ఆలోచనలో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: