నిరుద్యగులకు శుభవార్త చెప్పిన ఆర్‌బీఐ ఆ వార్త ముగిసే తేదిని కూడ ప్రకటించింది.ఇకపోతే రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో గ్రేడ్-బి ఆఫీస‌ర్స్ పోస్టుల ద‌ర‌ఖాస్తు గడువు అక్టోబరు 11తో ముగియనుందని తెలిపింది. పోస్టుల వారీగా సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా తెలిపింది.. ఈ అభ్యర్థులు నిర్ణీత మొత్తంతో దరఖాస్తు ఫీజు చెల్లించి, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నామని అధికారులు వెల్లడించారు..


ఇక ఈ పోస్టుల వివ‌రాలు పరిశీలిస్తే. ఆఫీస‌ర్ గ్రేడ్-బి (డీఆర్‌) పోస్టుల సంఖ్య మొత్తం 199, అందులో, జనరల్,156. ఎకనామిక్స్ పాలసీ & రిసెర్చ్ 20.. స్టాటిస్టిక్స్ & ఇన్‌ఫర్మేష‌న్ మేనేజ్‌మెంట్ 23.. ఇక ఈ ఉద్యోగాలకు అర్హ‌త‌ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ (ఎకనామిక్స్/ఎకనామిక్స్ సంబంధిత విభాగాలు)..  మాస్టర్ డిగ్రీ (స్టాటిస్టిక్స్)/ పీహెచ్‌డీ లుగా తెలిపారు. ఇకపోతే ఈ ఉద్యోగాలకు వుండవలసిన వ‌య‌సు, 01.09.2019 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో కొంత సడలింపు వర్తిస్తుందని పేర్కొన్నారు.


ఇక దరఖాస్తులూ ఆన్‌లైన్ ద్వారా స్వీకరిస్తారని, దీనికి సంబంధించిన ఫీజులు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఇంటిమేషన్ ఛార్జీలు, రూ.100.. జనరల్/ ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ వారికి, అప్లికేషన్+ఇంటిమేషన్ ఛార్జీలు రూ.850 గా నిర్ణయించారు. ఈ స్టాఫ్, ఎంపిక విధానాన్ని ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంట‌ర్వ్యూల ద్వారా నిర్వహిస్తారన్నారు. ఇక ఈ దరఖాస్తుకు సంబంధించి  ముఖ్యమైన తేదీలు..


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.09.2019.
ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 11.10.2019.
గ్రేడ్-బి (డీఆర్‌)-జ‌న‌ర‌ల్‌- ఫేజ్-1 , డీఈపీఆర్/ డీఎస్‌ఐఎం పేపర్-1 పరీక్ష: 09.11.2019.
గ్రేడ్-బి (డీఆర్‌)-జ‌న‌ర‌ల్‌- ఫేజ్-2 పరీక్ష: 01.12.2019.
గ్రేడ్-బి (డీఆర్‌)-డీఈపీఆర్/ డీఎస్‌ఐఎం పేపర్-2, 3 పరీక్షలు: 02.12.2019


ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప‌రీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయ‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, గుంటూరు, తిరుప‌తి, రాజమ‌హేంద్ర‌వ‌రం, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, చీరాల‌,విజ‌య‌న‌గ‌రం.లో ఏర్పాటు చేసారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: