రాజకీయాల్లో ప్రతిపక్షం అంటే ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపడం.. నిర్మాణాత్మకంగా వ్యవహారించడం.. కానీ ఇప్పుడు ప్రతిపక్షం అంటే ప్రభుత్వం చేసే ప్రతి పనినీ తిట్టడమే లక్ష్యం అన్నట్టుగా తయారైంది. ఇందుకు ఉదాహరణ కంటి వెలుగు పథకంపై టీడీపీ విమర్శలు.


ఏపీలో అంధత్వ నివారణలో భాగంగా ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించడం, అవసరమైన వారికి ఉచితంగా కళ్ల అద్దాల పంపిణీ, శస్త్రచికిత్సలు, ఇతర వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా జగన్ సర్కారు డా. వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభిస్తున్నారు. దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అనంతపురం జిల్లాలో ప్రారంభిస్తున్నారు.


ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలఆవరణలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఉదయం 11.35 గంటలకి కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. అయితే ఈ పథకంపైనా టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. కంటి వెలుగు ఓ కనికట్టు అంటూ మండిపడుతోంది. గతంలో తమ ప్రభుత్వం అమలు చేసిన పథకం పేరునే 'కంటి వెలుగు'గా మార్చి ఏపీ ముఖ్యమంత్రి జగన్ కని కట్టు చేస్తున్నారని, ఇది మరో జగన్మాయ అని ఆ పార్టీ విమర్శిస్తోంది.


తమ ప్రభుత్వ హయాంలో 222 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి, 67 లక్షల మందికి ఉచిత చికిత్స లక్షల మందికి ఉచితంగా కళ్ల జోళ్లు ఇచ్చామంటోంది టీడీపీ. దాన్నే ఇప్పుడు కంటి వెలుగుగా మార్చి ప్రజల కళ్లుగప్పాలని చూడటం దివాళాకోరుతనం' అని టీడీపీ మండిపడింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు బుధవారం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో టీడీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.


రాష్ట్ర విద్యుత్ ఆర్థిక సంస్థకు అప్పు పుట్టని దుస్థితి తెచ్చారని మండిపడ్డారు. ఎస్ బీఐ వెనక్కుపోవడానికి ప్రభుత్వ చేతగానితనమే నిదర్శనమని మండిపడ్డారు. అయితే ఇలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు చేయడానికి ఏ పార్టీ కూడా అతీతంగా లేదు మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: