గత నెలలో మోడీ అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అమెరికా విజయవంతమైన సంగతి తెలిసిందే.  అమెరికాలో పర్యటనలో భాగంగా హ్యూస్టన్ లో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమంలో మోదీతోపాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పాల్గొన్నారు. ఇద్దరు కలిసి ఈ పర్యటనలో పాల్గొనడం విశేషం. ఒకరిపై ఒకరు ప్రశసంలు కురిపించుకున్నారు.  ఈ పర్యటన తరువాత ఇండియా గౌరవం ప్రపంచదేశాల్లో మరింతగా పెరిగింది.  ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు.  


ఐరాస సైతం ఇండియా ప్రసంగంపై అభినందలు తెలిపింది.  ఇదిలా ఉంటె, రేపు  చైనా అధ్యక్షడు జిన్ పింగ్ ఇండియా పర్యటనకు వస్తున్నారు.  చెన్నై కు సమీపంలో ఉన్న మహాబలిపురంలో ఈ ఇద్దరు నేతలు భేటీ కాబోతున్నారు.  రేపు ఎల్లుండి వీరి మధ్య భేటీ ఉంటుంది.  వాణిజ్యం, బోర్డర్ సమస్యల పరిష్కారం దిశగా ఈ ఇద్దరు నేతలు చర్చించబోతున్నట్టు తెలుస్తోంది.  అయితే, పాకిస్తాన్ తో తమ స్నేహంలో మార్పు ఉండబోదని చైనా ఇప్పటికే స్పష్టం చేసింది.  


వాణిజ్యంలో చైనాతో ఇండియా పోటీ పడుతున్నది.  వాణిజ్యానికి ఇండియా అతిపెద్ద మార్కెట్ గా మారడంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు, ఇండియా మార్కెట్ ను వినియోగించుకోవడానికి ప్రపంచదేశాలు ఆసక్తి చూపుతున్నాయి.  భారతదేశంకూడా పెట్టుబడులను ఆహ్వానిస్తోంది.  మోడీ ప్రధానిగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత పొరుగు దేశాలతో సంబంధాలు, దౌత్య, వాణిజ్య సంబంధాలను పెంచుకుంటున్నారు.  దక్షిణాసియాలో ఇండియా బలమైన దేశంగా ఎదిగేందుకు ఇదొక మార్గంగా మారింది.  


అయితే, పాక్ మాత్రం ఇండియాపై విరుచుకుపడుతుంది.  అభివృద్ధిలో పోటీపడకపోయినా.. ఇండియాను విమర్శించేందుకు సిద్ధంగా ఉంటోంది.  కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ మొండివైఖరిని ప్రదర్శిస్తోంది.  కాశ్మీర్ విషయాన్నీ గమనిస్తున్నట్టు చైనా చెప్పింది.  కానీ, కాశ్మీర్ సమస్యను ఇరు దేశాలు చర్చలద్వారా పరిష్కరించుకోవాలని మరోమారు చైనా పేర్కొన్నది.  మహాబలిపురంలో జరిగే భేటీలో కాశ్మీర్ సమస్య గురించి చర్చించే అవకాశం ఉండకపోవచ్చు. ఇండియా.. చైనా దేశాల మధ్య బోర్డర్ వివాదాలే ఇందులో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: