టీవీ 9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాష్‌పై ఆ సంస్థ ఉద్యోగులు తీవ్రంగా మండిప‌డుతున్నారు. టీవీ9 అమ్మకం పూర్తైన తరువాత దశాబ్దకాలంగా సంస్థనే నమ్ముకుని ఎంతో కొంత బోనస్ వస్తుందని ఆశిపడ్డ ఉద్యోగులకే రవిప్రకాష్ సున్నం పూశారు. ఎవ్వ‌రి అనుమ‌తి లేకుండా ర‌విప్ర‌కాష్ సంస్థ ఉద్యోగుల‌కు ఇవ్వాల్సిన బోన‌స్‌ను సైతం నొక్కేశార‌న్న గుస‌గుస‌లు ఆ సంస్థ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయ‌ల‌ను విత్ డ్రా చేసుకున్న ఆయ‌న వాటిని త‌న సొంత ఖాతాల‌కు మ‌ళ్లించుక‌న్న‌ట్టుగా తెలుస్తోంది.


టీవీ 9 పేరుతో రవిప్రకాష్ - మూర్తి - క్లిఫర్డ్ పెరారీ 18 కోట్ల దోపిడి ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయాడని సమాచారం. ఈ నేపథ్యంలో రవి ప్రకాష్ చుట్టూ ఈడి - సీబిఐ - మనీలాండరింగ్ - బ్లాక్ మెయింలింగ్ కేసు కూడా చుట్టుకోనున్నాయా ? అంటే అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు. ఇక ర‌విప్ర‌కాశ్ మొత్తంగా తాను మాత్రం 6.5 కోట్లు బోన‌స్‌గా తీసుకుని.. ఉద్యోగుల‌కు మాత్రం కేవ‌లం రెండే రెండు సార్లు బోన‌స్‌గా ఇచ్చిన‌ట్టు స‌మాచారం.


ఈ బోన‌స్ కూడా ఒక‌సారి నెల‌లో స‌గం జీతం ఇచ్చి.. రెండో యేడాది అస‌లు జీతాలే పెంచ‌లేద‌ట. 2014 తర్వాత మూడేళ్లు వరుసగా జీతాలు పెంచనే లేద‌ని.. తాను మాత్రం కోట్ల‌కు కోట్లు బోన‌స్ తీసుకున్నాడ‌ని... తాను తీసుకున్న రు 6.5 కోట్లు కాకుండా... 5.5 కోట్ల‌ను బోన‌స్ మూర్తికి క‌ట్ట‌బెట్టాడ‌ని వారంతా మండిప‌డుతున్నారు. ర‌విప్ర‌కాష్‌ను కొత్త యాజ‌మాన్యం తొల‌గించినా... ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా  టీవీ9 ఉద్యోగుల నుంచి ఏ మాత్రం సానుభూతి రాకపోవడానికి కారణం  ఇదేనని అంటున్నారు పరిశీలకులు.


ఇక ఆయ‌న సీఈవోగా ఉన్న‌న్ని రోజులు త‌న అనుకున్న కొంత‌మందికి ఎక్కువ ఇంక్రిమెంట్లు వేసి... మిగిలిన వారిని నిర్దాక్షిణ్యంగా అణిచివేసే ప్ర‌క్రియ కూడా ర‌విప్ర‌కాష్ ఆధ్వ‌ర్యంలోనే జ‌రిగింద‌ని తెలుస్తోంది. ఏడాది కాలంలో సుమారు రూ.18 కోట్ల మేర టీవీ9 నిధులను రవిప్రకాష్ బృందం దారి మళ్లించినట్లు అలందా మీడియా ఫిర్యాదు చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: