ఓ గ్రామంలో దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం బొల్లారం గ్రామంలో ఎవరైనా కల్లు తాగితే 25 చెప్పు దెబ్బలు, 5వేల రూపాయిలు జరిమానా విధిస్తామంటూ గ్రామ సర్పంచ్ వీణ, సర్పంచ్ భర్త ధనుంజయ్ గ్రామంలో చాటింపు వేయించారు. అంతేకాదు ప్రతి గల్లీలో కట్టే పాతి వాటికీ చెప్పులు కట్టారు. 

                          

అహంకారానికి పరాకాష్టగా నిలిచారు ఆ గ్రామా సర్పంచ్చ్ దంపతులు. అయితే ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా ఈ ఘటనపై స్పందించిన గౌడ సంఘం నాయకులు గ్రామ పెద్దల తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్ని ధరలు పెరగడంతో స్వల్పనగా రేట్లు పెంచమని, కానీ గ్రామంలో ఇలాంటి రాక్షస ఆంక్షలు విధించారని వాపోయారు. 

                   

కల్లు డిపోలను వారు దేవాలయాలుగా భావిస్తామని, కానీ గ్రామస్తులు చెప్పుల దండలు కట్టి తమను అవమానించారని వాపోతున్నారు. కాగా ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అక్కడి పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా కంప్యూటర్ కాలంలో కూడా ఒకరు ఇంకొకరిని శాశించడం ఏంటి అని నెటిజన్లు ప్రవర్తిస్తున్నారు. 

      

ఏది ఏమైనా ఈ నిర్ణయం దారుణంగా ఉంది. అమానుషంగా ఉంది. కల్లు తాగితే చెప్పు దెబ్బలు ఏంటండీ అసలు. ఆరోగ్యం పడవుతుందని జరిమానా విధించడం కరెక్ట్ కానీ చెప్పు దెబ్బలు ఏంటి అసలు. అసలు ఆలా ఆంక్షలు పెట్టడానికే వారు ఎవరు ? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

                                  

మరింత సమాచారం తెలుసుకోండి: