ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియా పాక్ దేశాల మధ్య రోజు రోజుకు గొడవలు పెరిగిపోతున్నాయి.  ఈ గొడవల కారణంగా సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాక్ నుంచి నిత్యం తుపాకీ గుళ్ళు ఇండియా బోర్డర్ గ్రామాల్లోకి దూసుకొస్తున్నాయి.  వాటిని భారత భద్రతా బలగాలు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నాయి.  కవ్వింపు చర్యలకు పాల్పడటం.. కాల్పులు జరుపుతున్న ఇండియా తిప్పికొడుతుండటంతో.. పాక్ కొత్త ఎత్తు వేసింది.  


ఇండియాలోని తమకు అనుకూలంగా ఉండే వ్యక్తులకు ఆయుధాలను సప్లై చేసి ఇండియాలో అలజడులు సృష్టించాలని చూస్తోంది.  ఇందులో భాగంగానే ఆయుధాలను డ్రోన్ల్ ద్వారా ఇండియాలో జారవిడిచేందుకు సిద్ధం అయ్యింది.  కొన్ని రోజుల క్రితం పంజాబ్ రాష్ట్రంలో పాక్ ఇలానే డ్రోన్లద్వారా కొన్ని ఆయుధాలను జారవిడిచినట్టు సమాచారం ఉంది.  డ్రోన్లను ఇండియా ఆర్మీ తిప్పికొట్టడమే కాకుండా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.  


ఇదిలా ఉంటె ఇప్పుడు పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్ పూర్ పరిధిలోని ఝాగే హజారా సింగ్ గ్రామం వద్ద పాక్ కు చెందినరెండు డ్రోన్లు చక్కర్లు కొట్టినట్టు హజారా సింగ్ గ్రామ ప్రజలు చెప్తున్నారు.  డ్రోన్లు అనుమానాస్పదంగా ఉండటంతో భారత ఆర్మీకి సమాచారం అందించారు.  హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఆర్మీ.. ఆ సంఘటనపై ఆరా తీస్తోంది.  ఇండియా పాక్ సరిహద్దుల్లో ఉన్న గ్రామం ఇది.  ఈగ్రామంలోని సమాచారం.. పాక్ నుంచి ఇండియాలోకి రావడానికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఈ డ్రోన్లను వినియోగించుకున్నారని సమాచారం. 


సరిహద్దు గ్రామం కావడంతో అక్కడ నిఘా ఎక్కువగా ఉంటుంది.  అనుమానాస్పద డ్రోన్లు కనిపిస్తే.. వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు, ఆర్మీ అధికారులు గ్రామస్తులను కోరారు.  కొన్ని రోజుల క్రితం ఫిరోజ్ పూర్ లోని హుస్సేనీ వాలా సెక్టార్ లోను డ్రోన్లు హల్చల్ చేశాయి.  సమాచారం అందుకున్న ఆర్మీ అధికారులు ఆ డ్రోన్లను కూల్చివేసిన సంగతి తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: