వజ్రం - ప్రాచీన గ్రీకు భాషలో దీని పేరుకు అర్ధం "విడదీయలేనిది" అని. అత్యంత ఖరీదైన నవరత్నాలలో అతి ప్రధానమైన "స్ఫటిక రూప ఘన పదార్థం" ఇది కర్బన రూపాంతరం. ఇవి భూ అంతర్భాగంలోని లోతైన నేలమాళిగలో అత్యధిక ఉష్ణోగ్రత మరియు పీడనాల వద్ద ఘనీభవించిన కార్బన్ అణువుల నుంచి ఏర్పడుతాయి. సృష్టి లో లభించే అత్యంత కఠిన పదార్థాలలో ఒకటి కావటమే - వజ్రాన్ని వజ్రంతో కోయాలన్న సామెత జగద్వితమైనది. ఈ కాఠిన్యత దీనీలో ఉన్న కర్బన పరమాణువుల ప్రత్యేక అమరికవల్ల సంక్రమిస్తుంది. దీని తరువాత అత్యంత కఠినమైన పదార్థమైన "కోరండం" కన్నా ఇది నాలుగు రెట్లు గట్టిది. దాని గట్టిదనం వల్లను, దానికి గల కాంతి పరావర్తన ధర్మం వల్లను ఇది అత్యంత ఖరీదైన రత్నముగా గుర్తింపబడింది. 



మొట్ట మొదటి వజ్రాలు భారతదేశంలో, మరియు బోర్నియాలో లభ్యమైనట్లు చరిత్ర చెపుతోంది. చారిత్రక ప్రసిద్ధి గాంచిన వజ్రాలన్నీ భారతదేశానికి చెందినవే. వీటిలో కోహినూర్ వజ్రం అత్యంత ప్రాధాన్యత కలిగినది. 1867లో దక్షిణాఫ్రికా లో కనుగొనబడ్డ ఒక రాయి వజ్రంగా తేలడంతో కొన్ని సంవత్సరాల తర్వాత నదుల లోనూ కొన్ని నేలల్లోనూ వీటికోసం వెదుకు లాట ప్రారంభమైంది. ఆ తరవాత బోట్స్వానా, నమీబియా, కెనడా, దక్షిణాఫ్రికా దేశాలు వజ్రాలను ఉత్పత్తి చేయడంలో ముందున్నాయి.



మన భూమిలో అరుదుగా కనిపించే వజ్రాలలో, ఒక విచిత్రం కాదు చిత్రాతి చిత్రం "ఒక వజ్రం లోపల మరో వజ్రం ఉండటం" అత్యంత అరుదైన ఘటన. ఎంత అరుదైనది అంటే, ఇలాంటి "డైమండ్" అంటే "వజ్రం" కనిపించడం ప్రపంచానికి తెలిసి ఇదే తొలిసారి. దీన్ని సైంటిఫిక్ భాషలో "మాట్రియోష్కా డైమండ్" అంటారు. 
Image result for diamond within a diamond

రష్యా - సైబీరియాలోని ఒక గనిలో ఈ వజ్రం బయటపడింది. ఇందులో ఇమిడి ఉన్న చిన్న వజ్రం - అటూ ఇటూ చలిస్తుందని "రష్యా స్టేట్ మైనింగ్ కంపెనీ - అల్రోసా పి జె ఎస్ సి " తెలిపింది. అయితే ఈ డైమండ్ ఎప్పుడు పుట్టిందో తెలుసా? అన్న దానికి వజ్ర గుణాన్ని చెప్పే నిపుణులు మాత్రం - 80 కోట్ల సంవత్సరాల కిందటని చెపుతున్నారు. అందర్నీ ఆశ్చర్యపరిచే ఈ వజ్రం బరువు 0.62 కేరట్లు అంతర్గత వజ్రం బరువు 0.02 కేరట్లు. 


Diamonds


చరిత్రకు తెలిసి ఇప్పటి వరకూ కొన్నివేల గనుల్లో వజ్రాల తవ్వకాలు జరగగా,  దొరికిన ప్రతి వజ్రం వివరాలను గ్రంధస్థం చేశారు. ఐతే, ఎప్పుడూ ఇలాంటి వజ్రం కనిపించక పోవడం అత్యంత ఆశక్తిని గలిగించే విషయం. సాధారణంగా ఏ వజ్రమైనా లోపల ఖాళీ అన్నది ఉండదు అంటే బోలుగా ఉండదు. ఏదో ఒక ఖనిజం అందులో చేరిపోతుంది. ఈ డైమండ్ మాత్రం లోపల ఖాళీగా ఉంది. అదే సమయంలో, ఒక  చిన్ని వజ్రాన్ని తనలో నిక్షిప్తం చేసుకుంది. పెద్ద వజ్రాన్ని అటూ ఇటూ కదిపితే అంతరాన ఉన్న చిన్న వజ్రం కూడా "గిలక్కాయ లోని గింజ" లాగా అటూ ఇటూ కొట్టుకుంటుంది.


Image result for diamond within a diamond 

మరింత సమాచారం తెలుసుకోండి: