ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు అనంతపురం జిల్లాలో వైయస్సార్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారు. సీఎం జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 కోట్ల 12 లక్షల మందికి కంటి సమస్యలు ఉన్నాయని అన్నారు. కంటి సమస్యల గురించి నిర్లక్ష్యం చేస్తే చూపు కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కంటి పరీక్షలు, చికిత్స చేస్తామని సీఎం జగన్ అన్నారు. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిందని అన్నారు. 
 
560 కోట్ల రూపాయలతో వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జగన్ అన్నారు. దశల వారీగా కంటి పరీక్షలను నిర్వహిస్తామని ఉచితంగా కళ్ల జోళ్లను అందిస్తామని అన్నారు. మొదటి దశలో 62,489 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కంటి పరీక్షలు చేస్తామని ఒక్కో దశ ఆరు నెలలపాటు జరుగుతుందని అన్నారు. డిసెంబర్ నెల 1వ తేదీ నుండి కొత్త ఆరోగ్య కార్డులు ఇస్తామని సీఎం జగన్ తెలిపారు. 
 
ఆరోగ్యశ్రీ పథకాన్ని వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటితే వర్తింపజేస్తామని అన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలో 2000 వ్యాధులను చేరుస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లోని ఎంపిక చేసిన 150 ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. త్వరలో 432 కొత్త 108 ఆంబులెన్స్ వాహనాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 
 
104 వాహనాలు 676 అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కొత్త మెడికల్ కాలేజీలను వెనుకబడిన ప్రాంతాలలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. డయాలసిస్ రోగులకు జనవరి 1వ తేదీ నుండి 10,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారు. మా అమ్మ విజయమ్మ అనంతపురం జిల్లా ఆడపడుచు అని నేను అనంతపురం జిల్లా మనవడిని అని సీఎం జగన్ అన్నారు. అనంతపురం జిల్లా రూపురేఖలు మారుస్తానని సీఎం జగన్ చెప్పారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: