ఇటీవల ఉల్లిపాయల ధరలు చాల పెరిగాయి అని అందరికి తెలిసిందే. కానీ ధరలు పెరగడానికి ముఖ్య కారణమైన ఎగుమతులను తగ్గించే ప్రయత్నంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఘాటును తగ్గించే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ధరలు భారీగా పెరగడంతో.. ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం.. తాజాగా ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ చివరి నాటికి 2 వేల టన్నుల ఉల్లి దిగుమతి కోసం ప్రభుత్వం టెండర్లను కూడా ప్రారంభం చేస్తుంది.


మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదల కారణంగా దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. కిలో ఉల్లి రూ.80 వరకు చేరింది. ఈ విషయం పై  రంగంలోకి దిగిన కేంద్రం ఇటీవలే ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధం విధించింది. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా.. శ్రీలంక, మలేసియా, బంగ్లాదేశ్‌ రాష్ట్రాలలో  ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల న్యూఢిల్లీ వచ్చిన బంగ్లా ప్రధాని.. వంటల్లో ఉల్లి వాడొద్దని పనిమనుషులకు సూచించానని చెప్పారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు మనం.


ఉల్లి ధరల పెరుగుదలకు అక్రమ నిల్వలు కూడా ఒక విధమైన కారణమని భావిస్తోన్న కేంద్రం.. ఇక నుంచి హోల్ సేల్‌గా ఉల్లిని విక్రయించే వ్యాపారులు వంద క్వింటాళ్లకు మించి ఎక్కువ  ఉల్లిని నిల్వ ఉంచొద్దని ఆదేశాలు కూడా జారీ చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో 1.1 మిలియన్ డాలర్ల విలువైన ఉల్లిని దిగుమతి చేశారు.


మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో పెరిగిన ఉల్లి ధరలు ఎన్నికల్లో బీజేపీపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉండేలా చూడటం కోసం ప్రభుత్వం అన్ని విధాలా అప్రమత్తం ఉంటుంది అని అర్థం అవుతుంది. ఇక ఇప్పటి నుంచి ఉల్లి ధరలు దగ్గు మొఖం పట్టవచ్చు అని అనుకుంటుంది కేంద్రం. పళ్ళు చోట్ల ధరలు కూడా తగ్గాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: