చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ శుక్ర, శనివారాల్లో భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. చెన్నై సమీపంలోని మహాబలిపురంలో మోదీ, జిన్‌పింగ్ భేటీ కానున్నారు. వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై  చర్చలు జరగనన్నూయి. చైనా అధ్యక్షుడు చెన్నైలో అడుగుపెట్టడానికి ముందే ఎయిర్ చైనా కార్గో విమానంలో ఆయన భద్రత కోసం ఉపయోగించే నాలుగు కార్లు చెన్నై ఎయిర్‌పోర్ట్ చేరుకున్నాయి. మంగళవారం రాత్రి చెన్నైలో ల్యాండయిన ఈ విమానంలో అధ్యక్షుడి వెంట వస్తోన్న సిబ్బందికి అవసరమైన వస్తువులను కూడా వెంట తీసుకొని వచ్చారు.


శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు జిన్‌పింగ్ చెన్నై చేరుకుంటారు. వెంటనే ఆయన గిండిలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్‌కు వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు మహాబలిపురం వెళ్తారు. ఆయనతోపాటు 200 మంది దౌత్య, భద్రతా సిబ్బంది కూడా చైనా నుంచి వస్తారని సమచారం. 


జిన్‌పింగ్ చైనాలో తయారైన హంగ్‌ఖీ కార్లను ఉపయోగిస్తారు. హంగ్‌ఖీ అంటే ఎర్ర జెండా అని అర్థం వస్తుంది. చైనాలో అత్యంత ఖరీదైన కారుగా పేరొందిన ఈ వాహనాన్ని ఎఫ్ఏడబ్ల్యూ కారు కంపెనీ తయారు చేసింది. 1958లో ఈ కార్ల ఉత్పత్తి ప్రారంభమైంది. అధ్యక్షుడి కోసమే ప్రత్యేకంగా HongQi L5 మోడల్‌ను తయారు  చేసింది. తమ అధ్యక్షుడి కోసం రూపొందించిన వాహనంలోని ప్రత్యేకతల గురించి చైనా కార్ల కంపెనీ గ్యోపత పాటిస్తోంది. అందులోని చాలా ఫీచర్ల గురించి బయట ఎవరికీ తెలియదు అసలు.


 ఈ కారు స్టార్ట్ చేసిన 8 సెకన్లలోనే 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. 18 అడుగుల పొడవు, 6.5 అడుగుల వెడల్పు, ఐదు అడుగుల ఎత్తుతో రాజసం ఉట్టిపడేలా ఈ వాహనం ఉంటుంది. 3152 కిలోల బరువు ఉంటుంది. హంగ్‌ఖీ ఎల్5 మోడల్ ధర రూ.5.60 కోట్ల వరకు ఉంటుంది అని తెలిపారు. ఈ కారు ట్యాంకులో గరిష్టంగా 105 లీటర్ల గ్యాసోలిన్‌ నింపొచ్చు. ఒక్కసారి ట్యాంక్ నింపితే 500 మైళ్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. ఇందులో హైస్పీడ్ ఏసీ, శాటిలైట్ ఫోన్ ఉంటాయి. దీంతో కార్లో వెళ్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాట్లాడొచ్చు. ఈ కారు డోర్లు బుల్లెట్ ప్రూఫ్ కాదు. కానీ చిన్నపాటి మిస్సైళ్లతో దాడి చేసినా తట్టుకోగలవు.


మరింత సమాచారం తెలుసుకోండి: