రోడ్లపై ఇష్టానుసారంగా భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త వేస్తున్న వారిపై జీహెచ్‌ఎంసీ చర్యలు భారీగా తీసుకుంటుంది.ఇటీవల రోడ్లపక్కన చెత్త వేస్తున్న ఇద్దరికి రూ. 40 వేల జరిమానా విధించారు. చందానగర్‌ వెంకటాద్రి కాలనీకి చెందిన రవీందర్‌రెడ్డి భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్డుపై వేసినందుకు రూ. 30 వేల జరిమానా విధించారు. రోడ్డుపై చెత్త వేయడంతో పాటు డస్ట్‌బిన్‌లను సైతం ఏర్పాటు చేసుకోకపోవడంతో మూసాపేటలోని సాయి బాలాజీ వైన్స్‌కు రూ. 10 వేల జరిమానా కూడా విధించడం జరిగిన విషయం అందరికి తెలిసిందే.


ఇక జరిగిన కూడా ఇంకా ప్రజల తీరు మార్చుకోవడం లేదు. రోడ్డుపై వ్యర్థాలు వేసిన వారిపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కఠిన చర్యలు తీసుకుంది. బుధవారం నాడు  మియాపూర్ ప్రధాన రోడ్డుపై భవన నిర్మాణ వ్యర్థాలను వేసిన విషయాన్ని గుర్తించిన జీహెచ్‌ఎంసీ అధికారులు   ఘటనపై అడిగి తెలుసుకున్నారు. బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులను గ్రహించి చర్యలు తీసుకున్నారు. రోడ్డుపై వ్యర్థాలు వేసి, ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు కలిగించిన వారిపై జీహెచ్‌ఎంసీ అధికారులు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించడం జరిగింది.


నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరించారు. భవన నిర్మాణ వ్యర్థాలు తరలించడానికి జీహెచ్‌ఎంసీ ప్రత్యేక వాహనాలను సిద్ధం చేసిందని.. సమాచారం ఇచ్చి సేవలను వినియోగించుకోవాలని తెలియచేశారు. ప్రజలు కూడా తీరు మార్చు కోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులు మనవి చేశారు.

స్వచ్ఛ భరత్ అని కార్యక్రమాలు నిర్వహిస్తున్న కూడా ఇంకా ప్రజలలో ఎటువంటి మార్పులు రావడం లేదు. ప్రజలలో ఇంకా మార్పులు రావడం లేదు, ప్రభుత్వం ఇంకా కఠినమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇలాంటి ఘటనలపై  అధికారుల నుంచి అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తే ఏమైనా మార్పు వస్తుందేమో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: