సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఢీలాపడ్డ టీడీపీ శ్రేణుల్లో స్థైర్యాన్ని నింపేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాల్లో నేటి నుంచి పర్యటిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్టోబరు 10 నుంచి 22 వరకు జిల్లాల్లో పర్యటించనున్నారు. 


తొలుత విశాఖ జిల్లాల్లో రెండు రోజులు పర్యటిస్తారు. అనంతరం 14, 15 తేదీల్లో నెల్లూరు, 21, 22 తేదీల్లో శ్రీకాకుళంలో ఆయన పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఈ మూడు జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా సమీక్షలు, నేతలతో సమావేశాలు నిర్వహిస్తారు. పార్టీని బలోపేతం చేయడంతోపాటు భవిష్యత్‌ కార్యాచరణపై ఆయన చర్చించనున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలియాచేసారు.


 టీడీపీ నియోజకవర్గాలవారీగా సమీక్షల కోసం విశాఖ నగరంలోని రాక్‌డేల్‌ లేవుట్‌ ప్రాంతంలో ఉన్న టీడీపీ ఆఫీసులో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సహా రాష్ట్ర, జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాల నేతలు హాజరవుతున్నారు. టీడీపీ అంచనా ప్రకారం ఒక్కో నియోజకవర్గం నుంచి 60 మందిని ఆహ్వానించారు.  తొలి రోజు గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి పాడేరు, అరకు, పాయకరావుపేట, నర్సీపట్నం, యలమంచిలి నియోజకవర్గాల వారిగా సమీక్షలు నిర్వహిస్తారు. రాత్రి 9 గంటల తిరిగొచ్చి చోడవరం, మాడుగుల సమీక్ష ఉంటాయి.
                                                   
శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పెందుర్తి, అనకాపల్లి, భీమిలి, తరువాత గాజువాక, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, తూర్పు నియోజకవర్గాల సమీక్షలుంటాయి. అనంతరం శుక్రవారం రాత్రి చంద్రబాబు ప్రయాణమవుతారు. చంద్రబాబుకు ఘనస్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. విశాఖ విమానాశ్రయం నుంచి జాతీయ రహదారి మీదుగా పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: