మనదేశంలో అందమైన ప్రదేశాలు ఎక్కువగా కాశ్మీర్లోని ఉన్నాయి.  అందమైన గులాబీ పూలతోటలు.. యాపిల్ పండ్లతోటలు..డాల్ లేక్ సరస్సు.. ఇలా చెప్పుకుంటూ పొతే అక్కడి అందాలను వర్ణించడానికి ఓ పెద్ద గ్రంధం తయారు చేసుకోవచ్చు.  అయితే, ఆ అందాన్ని కబళించేందుకు ముష్కరులు నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటారు.  ముష్కరుల నుంచి కాశ్మీర్ కాపాడుకోవడనికి భారత సైనికులు నిత్యం పహారా కాస్తుంటారు. 

ఆగష్టు 1 వ తేదీ నుంచి కాశ్మీర్ రాష్ట్రంలో పర్యాటకులను నిషేదించింది.  పెద్ద ఎత్తున ఆ రాష్ట్రంలో బలగాలను మోహరించింది.  అమర్నాద్ యాత్రను అర్ధాంతరంగా నిలిపివేసి భక్తులను వెనక్కి పంపించివేసింది.  ఆగష్టు 5 వ తేదీ వచ్చే సరికి కాశ్మీర్ లో కర్ఫ్యూ వాతావరణం నెలకొన్నది.  ఆగష్టు 5 వ తేదీన కాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370 ని రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.  ఆ రోజు నుంచే కాశ్మీర్ సంపూర్ణంగా ఇండియాలో భాగం అయ్యింది.  


దాదాపు 60 రోజులకు పైగా కాశ్మీర్ ఆంక్షలు విధించారు.  ఇప్పుడు అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది.  60 రోజులపాటు గృహనిర్బంధంలో ఉంచిన నేతలను ఒక్కొక్కరిగా రిలీజ్ చేస్తున్నారు.  ఇలా గృహనిర్భందలో ఉంచిన వాళ్ళను రిలీజ్ చేస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. భద్రతాపరమైన పొరపాట్లు జరగకుండా జాగ్రత్తపడుతున్నారు.  తాజాగా, ఈరోజు నుంచి కాశ్మీర్ కు టూరిస్టుల రాకను అనుమతించింది. 


నిన్నటి వరకు టూరిస్టులు లేక విలవిలలాడింది కాశ్మీర్... ఇప్పడు పర్యాటకుల రాకతో సందడిగా మారింది.  పైగా కేంద్రం పర్యటక రంగాన్ని పెద్ద ఎత్తున అక్కడ అభివృద్ధి చేసేందుకు సిద్ధం అయ్యింది.  పర్యాటకులు రావడంవలన ఆ రాష్ట్రానికి ఆదాయం లభిస్తుంది.  మంచుకురిసే సీజన్ కావడంతో.. అక్కడి ప్రకృతి మరింత అందంగా మారుతుంది.  అందుకే ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు.  ఇకనుంచి విదేశీయులు, పర్యాటకుల రాకతో ఆ రాష్ట్రం కళకళలాడబోతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: