పర్యావరణానికి అన్నింటికంటే  పెద్ద ముప్పు ప్లాస్టిక్ వలన కలుగుతున్నది.  ప్లాస్టిక్ ను వాడి పారేస్తే.. అది భూమిలో కలిసిపోవడానికి చాలా సమయం పడుతుంది.  ప్లాస్టిక్ వస్తువులను రీ సైక్లింగ్ చేయడం వలన దాని నుంచి విడుదలయ్యే విషవాయువులు పర్యావరణంతో పాటు ప్రజలకు చేటు చేస్తుంటాయి.  పర్యావరణం సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలి అంటే.. తప్పకుండా.. ప్లాస్టిక్ ను బ్యాన్ చేయాలి.  


అక్టోబర్ 2 వ తేదీన  ప్రధాని మోడీ ప్లాస్టిక్ రహిత భారతదేశం దిశగా అడుగులు వేసేందుకు నిర్ణయాలు తీసుకున్నారు.  వాటిని పక్కాగా అమలు చేస్తే.. తప్పకుండా దేశంలో కొంతవరకు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు.  ఇది ఒక్కరి చేతిలోనే లేదనాతె ఒక్కరి వలనో సాధ్యం అయ్యే విషయం కాదు.  అందుకే ప్లాస్టిక్ ను నిషేదించాలని ప్రతి ప్రతి ఒక్కరు సంకల్పించుకోవాలని, సంకల్పబలం గట్టిగా ఉంటె తప్పకుండా విజయం సాధించవచ్చు అని మోడీ పేర్కొన్న సంగతి తెలిసిందే.  


కాగా, ఈరోజు కెసిఆర్ ప్లాస్టిక్ నిషేధంపై కీలక నిర్ణయం తీసుకున్నారు.  రాష్ట్రంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించాలని నిర్ణయం తీసుకున్నారు.  ఈరోజు జరిగిన కలెక్టర్లు, మంత్రుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  ప్లాస్టిక్ ను నిషేధించడం వలన పర్యావరణాన్ని కొంతమేర కాపాడుకోవచ్చు అనే నినాదంతో కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.  ప్లాస్టిక్ ఉత్పత్తిని నిలిపివేస్తేనే ప్లాస్టిక్ వాడకం తగ్గిపోతుంది.  


ప్లాస్టిక్ వాడకం తగ్గిపోతే పర్యావరణం అదే రక్షించబడుతుంది.  ఇప్పుడు సముద్రాల్లో ఎక్కడ చూసిన ప్లాస్టిక్ వస్తువులే కనిపిస్తున్నాయి.  దీనికరణంగా సముద్రంలో జలచరాలు సంఖ్య తగ్గిపోతున్నది.  అంతేకాదు, నగరాల్లో ప్లాస్టిక్ వస్తువులను వాడి బయట పడేయడం వలన నాళాల్లో అడ్డుపడుతుంటాయి.  ఫలితంగా మురికినీరు ప్రవాహం ఆగిపోతుంది.  కాసేపు నగరంలో వర్షం కురిస్తే నాళాలు పొంగి ప్రవహిస్తున్నాయి.  దీనికి కారణం ప్లాస్టిక్ అనే చెప్పొచ్చు. పర్యావరణానికి చేటు చేసే ప్లాస్టిక్ ఉత్పత్తులను బ్యాన్ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు.  ఈ నిర్ణయాన్ని పక్కాగా అమలు జరిపితే తప్పకుండా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: