తెలుగుదేశంపార్టీ భవిష్యత్తుపై నేతల్లోనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రెండు రోజుల విశాఖపట్నం జిల్లా  పర్యటనలో చంద్రబాబునాయుడు మాటలు విన్నవారికి అనుమానాలు మరింతగా పెరిగిపోయాయి. ’ఎంతగా అణగదొక్కితే అంతగా పైకి లేస్తాం’ అని చంద్రబాబు చెప్పే  సినిమా డైలాగులు వినటానికి బాగానే ఉంటాయి కానీ ఆచరణలో మాత్రం ఎందుకూ పనికి రానివని అందరికీ ఇప్పటికే అర్ధమైపోయింది.


విశాఖలో పార్టీ సమావేశంలో చంద్రబాబు మాటలు విన్నవారికి ఆశ్చర్యం కలిగించాయి. దాదాపు అర్ధగంట పాటు మాట్లాడిన చంద్రబాబు మాటల్లో ఎక్కడా పసలేదు. పనికిమాలిన ఆరోపణలు, విమర్శలు తప్ప మరోటి లేదు. ప్రతి చిన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టి  నోటికొచ్చినట్లు మాట్లాడటాన్ని పార్టీ నేతలే మెచ్చుకోవటం లేదు.

 

వైసిపిది అరాచక పాలన అంటూ మండిపోతున్నారు. నిజంగా ఎక్కడ అరాచకాలు జరుగుతున్నాయో చెప్పలేకపోతున్నారు. హత్యా రాజకీయాలు చేస్తున్నారంటూ శాపనార్ధాలు పెడుతున్నారు.  నిజానికి వైసిపి నేతలెవరూ టిడిపి నేతలను హత్యా రాజకీయాలు చేసిందే లేదు.

 

ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయటంలో బిజీగా ఉన్నారు. మరికొన్ని పథకాల అమలుకు టైం టేబుల్ ప్రకటించేశారు. ఒకవైపేమో జగన్ కచ్చితమైన ప్రణాళికతో వ్యూహాత్మకంగా  ముందుకెళుతున్నారు. అదే సమయంలో చంద్రబాబేమో పనికిమాలిన డైలాగులు, ఆరోపణలతో తనను తానే పలుచన చేసుకుంటున్నారు.

 

ఎంతగా అణగదొక్కితే అంతగా పైకి లేస్తామని చెప్పటం కూడా ఓ పనికిమాలిన డైలాగనే చెప్పాలి. చంద్రబాబు నేతృత్వంలో తెలంగాణాలో టిడిపి ఏ స్ధాయికి దిగజారిపోయిందో అందరూ చూసిందే. ఎంతమంది పట్టి పైకి లేపినా లేవలేని పరిస్ధితిలో పార్టీ కూరుకుపోయింది.

 

జగన్ వద్దనుకున్నారు కాబట్టే టిడిపి ఎంఎల్ఏలు ఇంకా పార్టీలో కంటిన్యు అవుతున్నారు. లేకపోతే టిడిపిలో తండ్రి, కొడుకులు తప్ప మిగిలే వాళ్ళు ఎవరంటే కచ్చితంగా తమ్ముళ్ళే చెప్పలేని పరిస్ధితి. కాబట్టి ముందుగా ఓటమిని హుందాగా అంగీకరించి మళ్ళీ ఎలా బతోపేతం చేసుకోవాలో ఆలోచించాలి. లేకపోతే ఏపిలో కూడా తెలంగాణాలో పరిస్దితి తప్పదు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: