యువత గెలుపే తన గెలుపు అని నమ్మిన ఒకే ఒక్క యంగ్ అండ్ డైనమిక్ స్వర్గీయ శ్రీ "రాజశేఖర్ రెడ్డి"గారు తనయులు గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్ గారు.ఈ మధ్య ఎక్కువ మోడీ దెగ్గర గడపడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. జగన్ మరో సారి ఢిల్లీ వెళ్తున్నారు. ఈ నెల 5వ తేదీన ఢిల్లీలో ప్రధానితో సుదీర్ఘంగా భేటీ అయిన ముఖ్యమంత్రి జగన్ ఆ వెంటనే అమరావతి తిరిగి వెళ్లిపోయారు. దీంతో.ఆ రోజు కలవాలని భావించిన బీజేపీ జాతీయాధ్యక్షుడు,కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటుగా ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం కావాలని భావించారు. ఇక, ఇప్పుడు శుక్రవారం ముఖ్యమంత్రి మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు.

ఆయన మరోసారి ప్రధానితో పాటుగా అమిత్ షా అదే విధంగా ఆర్దిక మంత్రితో పాటుగా జల వనరుల శాఖా మంత్రితోనూ సమావేశం కానున్నారు. రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి ఢిల్లీలోనే బస చేయనున్నారు. అయితే ముఖ్యమంత్రి మరోసారి ప్రధానితో భేటీ కోసం అప్పాయింట్ మెంట్ కోరారని.శుక్ర లేదా శని వారాల్లో ఆయన ప్రధానితో భేటి అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రధానితో రాష్ట్ర సమస్యల పైన చర్చించినట్లుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో చెబుతున్నారు.ఇద్దరి మధ్య ఒన్ టు ఒన్ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చినట్లుగా కూడా వారు స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీ రానున్నారు. ఆ రోజు ఆయన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలుస్తారని తెలిసింది. అవసరమైతే శనివారం కూడా జగన్‌ ఢిల్లీలోనే ఉండొచ్చని తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ ఆయన సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గత పర్యనటలోనే ఆయన అమిత్ షా తో పాటుగా ఆర్దిక మంత్రిని కలవాలని భావించినా సాధ్యపడలేదు. ఈ సారి వారిద్దరితో పాటుగా జల వనరుల శాఖా మంత్రి షెకావత్ ను సైతం కలవాలని నిర్ణయించారు. అయితే..ప్రధానితో వారం క్రితమే భేటీ అయిన ముఖ్యమంత్రి తిరిగి ఆయనతో భేటీ అయ్యే ప్రయత్నాలు చేయటం వెనుక అసలు కారణం ఏంటనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కలిగిస్తోంది.చూద్దాం జగన్,మోడీల భేటి సంగతేంటో,చర్చలు ఎంతవరకొస్తాయో వేచి చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: