ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. విశాఖలో జరిగిన కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుని టీడీపీ నేతలపై, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ విషయంలో కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి, పార్టీ ఓడిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదని ఎవరైతే ఈ అక్రమ కేసుల భారాన్ని మోస్తున్నారో వారందరికి పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.



ఇలాంటి సమయంలోనే అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు,  కార్యకర్తలపై నమోదైన కేసులను పరిష్కరించేందుకు పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక న్యాయ బృందాన్ని ఏర్పాటు చేసామని. కేసులు ఎదుర్కొంటున్న వారు న్యాయవాదులను పెట్టుకుని సరైన సమయంలో స్పందించాలని, ఇక ఈ కేసులను ఎదుర్కొనేందుకు అండగా ఉంటానని, అవసరమైతే ఎంత డబ్బైనా సరే, సరిపోకుంటే  భిక్షాటన చేసైనా కార్యకార్తలను కాపాడుకుంటానని చంద్రబాబు ఆవేశంగా చెప్పారు.



ఇకపోతే చట్టాన్ని చుట్టంగా మార్చుకోవాలని కొందరు చూస్తున్నారని, కానీ అలాచూస్తే అదే ఉరితాడై చుట్టుకుంటుందని చంద్రబాబు హెచ్చరించారు. ఇకపోతే ఇప్పుడు అక్రమ కేసులు పెడితే తర్వాత కాలంలో ముద్దాయిలుగా మిగిలిపోవాల్సి వస్తుందని అన్నారు. ఇక చంద్రబాబు ఇంతలా ఘాటు వ్యఖ్యాలు చేయడానికి కారణం.


ఇప్పుడు రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా,అసలు ఊపిరి తీసుకొనీయకుండా ఒక్కొక్క కేసు బయటకు వస్తుండటం వల్ల ఏం చేయాలో పాలుపోని ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తుందని కొందరు అనుకుంటున్నారు.  ఇకపోతే ప్రధాన ప్రతిపక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు విఫలమయ్యారని, ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక అనవసరమైన వాదనలు చేస్తూ కాలయాపన చేస్తున్నాడని కొందరు నేతలు చెవులు కొరుక్కుంటున్నారట !


మరింత సమాచారం తెలుసుకోండి: