హైదరాబాద్ నగరంలోని ప్రజల దాహం తీర్చటంలో గోదావరి నది ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ ఈరోజు ఉదయం నుండి 48 గంటల వరకు గోదావరి నీటి సరఫరాను నిలిపివేయనున్నారు. నగరంలోని సగం జనాభాపై ఈ ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. నీటిని నిలిపివేయటం వలన 172 మిలియన్ గ్యాలన్ల నీటి తరలింపు ఆగిపోనున్నట్లు తెలుస్తోంది. మొదట అధికారులు మూడు రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేయాలని భావించారు. 
 
కానీ మూడు రోజుల పాటు నీటి సరఫరా ఆగితే ప్రజలు చాలా ఇబ్బంది పడతారని భావించిన అధికారులు నీటి సరఫరా నిలుపుదల రెండు రోజులకు తగ్గించారు. అధికారులు కేవలం 48 గంటల పాటు మాత్రమే నీటి సరఫరా నిలిపివేసినా నగరంపై మాత్రం ఈ ప్రభావం నాలుగైదు రోజుల వరకు ఉండబోతుందని తెలుస్తోంది. నగరంలో కొన్ని ప్రాంతాలలో రోజు విడిచి రోజు నీటి సరఫరా అవుతుండగా మరికొన్ని ప్రాంతాలలో మాత్రం మూడు రోజులకొకసారి నీటి సరఫరా జరుగుతోంది. 
 
ప్రస్తుతం మూడు రోజులకొకసారి నీటి సరఫరా జరిగే ప్రాంతాలలో మాత్రం ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీ 13 లో భాగంగా గ్రావిటీ కెనాల్ నిర్మాణ పనులకు 3000ఎంఎం గోదావరి పైపులైన్ అడ్డంగా మారటంతో కెనాల్ మీద నిర్మించిన వంతెన నుండి పైపులైన్ వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందువలన నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. నగరంలోని తార్నాక, లాలాపేట, మౌలాలి, సింగపూర్ టౌన్ షిప్, పోచారం, ఎన్ ఎఫ్ సీ, బోరబండ, సనత్ నగర్, భరత్ నగర్, భాగ్యనగర్, బాలానగర్, మూసాపేట, కే పీ హెచ్ బీ, కూకట్ పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్ పేట్, ఎస్ ఆర్ నగర్, యూసుఫ్ గూడ, ఎల్లారెడ్డిగూడ, ఎర్రగడ్డ ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. 
 
తుర్కపల్లి బయోటెక్ పార్క్, కంటోన్మెంట్ బోర్డు పరిధి, సీ ఆర్ పీ ఎఫ్ మెస్, దేవరాయాంజల్, అహ్మద్ గూడ, ఆర్జీకె, చేర్యాల, నాగారం, దమ్మాయిగూడ, కీసర, బాలాజీనగర్, జవహర్ నగర్, మల్లంపేట, అమీన్ పూర్, బొల్లారం, బాచుపల్లి, ప్రగతినగర్, నిజాంపేట, బోలారం, పటాన్ చెరు, ఆర్సీపురం, చందా నగర్, మయూరి నగర్, మాతృశ్రీ నగర్, మియాపూర్, హఫీజ్ పేట, కైలాసగిరి, న్యూ ఓయూ కాలనీ, అల్వాల్, ఫతర్బాలాయి నగర్, మల్కాజిగిరి, చాణక్యపురి, గౌతం నగర్, డిఫెన్స్ కాలనీ, పేట్ బషీరాబాద్, కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట, సూరారం, షాపూర్ నగర్, జీడిమెట్ల ప్రాంతాలలో 18వ తేదీ ఉదయం వరకు నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: