కొద్ది గంటల క్రితమే తెలంగాణలోని హుజూర్ నగర్ లోని ఉప ఎన్నిక ముగిసింది. అయితే ఇప్పుడు ఏపీలో కూడా ఇలాంటి ఒక ఉప ఎన్నిక ఖాయమని కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక వైపేమో వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సెట్టింగ్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి రావాలంటే పదవికి రాజీనామా చేయాలని షరతు పెట్టారు. క్రితం సారి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తన పార్టీ ఎమ్మెల్యేలను విలువల్లేని రాజకీయాలు ద్వారా లోబట్టుకున్నాడని కానీ తాను అలాంటి వాటికి అతీతం అని నిరూపించేందుకు ఇప్పుడు ఈ షరతుని విధించినట్లుగా జగన్ స్పష్టం చేశాడు. 

ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరేందుకు ఒక పార్టీ ఎమ్మెల్యే ముగ్గు చూపిస్తున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదే కనుక నిజమైతే ఏపీలో కూడా ఒక ఎన్నిక ఖరారు అయినట్లే. ఇక్కడి విశేషం ఏమిటంటే ఆ నియోజకవర్గం కాస్తా జనసేన పార్టీ విజయం సాధించిన రాజోలు కావడం. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాజీనామా ఊహాగానాలు జోరందుకున్నాయి. అంతేకాకుండా జనసేనలో రాపాకకు తగిన గుర్తింపు రావట్లేదు అన్న వాదన కూడా జనాల్లో ఈ మధ్య బలంగా నాటుకుపోయింది. 

పవన్ కళ్యాణ్ వెంట ఎక్కువగా రాపాక అంతగా కనిపించడు. జనసేన తరపున ప్రతీ ఒక్క నియోజకవర్గంలో ఒక అభ్యర్థి పోటీ చేస్తే అందరూ ఓడిపోయారు కానీ రాపాక ఒక్కడే అనూహ్య రీతిలో విజయం సాధించారు. చివరికి పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయాడు. కానీ అలాంటి రాపాక కు పార్టీ వర్గాలు పెద్దగా ప్రాముఖ్యత ఇస్తున్నట్లు ఏనాడూ కనిపించలేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ సమక్షంలోనే నాదెండ్ల మనోహర్ రాపాక మీటింగ్ కి ఆలస్యంగా రావడంతో కొంచెం గట్టిగా మాట్లాడి అతనిని అవమానానికి గురి చేశాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది. నాదెండ్ల మనోహర్ ఏమో పార్టీలో ఉండి కూడా కనీస ఎమ్మెల్యేగా కూడా నెగ్గలేకపోయాడు.

ఇలాంటి పరిణామాల మధ్య రాపాక జనసేన పార్టీకి రాజీనామా చేయవచ్చని అంతా అనుకుంటున్నారు. అంతేకాకుండా ఈ మధ్యనే జగన్ ఫోటో కి పాలాభిషేకం చేసిన రాపాక అసెంబ్లీ లో అడుగు పెట్టిన కొత్తల్లో కూడా జగన్ పరిపాలనను బాగా మెచ్చుకున్నారు. కాబట్టి ఆయన త్వరలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నాడని ప్రసారం కొనసాగుతోంది. అదే కనుక జరిగితే ఏపీలో లో ఉపఎన్నికల హోరు మొదలయ్యే రోజులు దూరంలో లేవు.


మరింత సమాచారం తెలుసుకోండి: