తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు రంగం సిద్ధమైంది. నేడు రాజకీయ పార్టీలు, వారి అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. అయితే అప్పుడే అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి గారు తన మార్క్ రాజకీయాలు చేసేస్తున్నారని సమాచారం. వరంగల్ జిల్లాలో అటు లెక్కింపు ప్రారంభమైందో లేదో ఇటు అధికార పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరదీసింది. 

 

 

వరంగల్ జిల్లాకు సంబంధించి తొమ్మిది మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపును అధికారులు ఈ ఉదయం ప్రారంభించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును ప్రారంభించారు అధికారులు. కౌంటింగ్ వద్ద ఉండాల్సిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అక్కడ లేరు. పార్టీ అభ్యర్థులు కూడా కౌంటింగ్ కేంద్రాలకు రాకుండా పార్టీ క్యాంపు కార్యాలయాలకు తరలివెళ్లారు. కారణం.. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ఎన్నిక‌లు ప‌ర్య‌వేక్షిస్తోన్న ఓ మంత్రి అక్కడ ఉండటమేనట. అప్పుడే సదరు మంత్రిగారు క్యాంప్ రాజ‌కీయాలు ప్రారంభించేశారు అని వార్తలు షికారు చేస్తున్నాయి. కారు జోరుకి బ్రేకులు ఉండవని ఆ మంత్రి గారి గట్టి నమ్మకమని చెప్తున్నారు. జిల్లాలో టీఆర్ఎస్ కు మంచి పట్టు ఉంది. అక్కడ గెలుపు ఖాయం అని అంటున్నారు. 

 

కానీ.. ఎంత నమ్మకమున్నా కౌంటింగ్ దగ్గరకు అభ్యర్థి, నాయకులు కూడా వెళ్లడం లేదు. పార్టీలో తనకు ఉన్న పట్టు కారణంగా అప్పుడే తమకు ఏం చేసుకోగలమో ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. కీలక పదవులు పొందడం, అధినేతను మెప్పించడంలో భాగంగా తన తెలివిని, పలుకుబడిని ఉపయోగిస్తున్నారట సదరు మంత్రి గారు. ఇప్పటికే టీఆర్ఎస్ కు ఆధిక్యంలో ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో తమకు అనుకూలంగా ఉండేందుకు అధినేత మెప్పుపొందేందుకు ప్రయత్నాలు మొదలైపోయాయి. మరి మంత్రి గారు ఎంతవరకూ తమవారికి న్యాయం చేస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: