మహిళలపై పెరిగిపోతున్న లైంగిక నేరాలను తుడిచిపెట్టేయడానికి ఏపీ సీఎం జగన్ తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో వేధింపులకు గురైన ఓ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారిణికి న్యాయం జరిగింది. దిశ యాప్ ద్వారా కంప్లైంట్ ఇవ్వడంతో కేవలం 7నిముషాల్లో పోలీసులు స్పందించారు. ఉన్నతాధికారిని వేధిస్తున్న ఆ నిందితుడి ఆట కట్టించారు. ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ సీఎం జగన్ కు ఓ సమావేశంలో వివరించగా ఆయన చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు. 

 

 

విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో ఈరోజు ఉదయం తెల్లవారుఝామున 4గంటల సమయంలో ఓ ప్రొఫెసర్ సదరు ఉన్నతాధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బస్సులో వెనుక సీట్లో నుండి అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ ప్రొఫెసర్ చర్యలతో ఆమె అప్రమత్తమై  దిశ యాప్ నుంచి SOS ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న ఏలూరు త్రీ టౌన్ పోలీసులు కేవలం 7 నిమిషాల వ్యవధిలో బాధితురాలి దగ్గరకు చేరుకున్నారు. ఆ కీచక ప్రొఫెసర్ ను అదుపులోకి తీసుకున్న ఏలూరు త్రీటౌన్ పోలీసులు అక్కడి నుంచి స్టేషన్ కు తరలించారు. దీంతో దిశ యాప్ ద్వారా మొదటి స్పందనకు పోలీసులు స్పందించిన తీరుకు సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. 

 

 

ఈ విషయాన్ని రాష్ట్ర పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్ ఓ సమావేశంలో సీఎం జగన్ కు వివరించారు. మహిళల భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. మహిళా భద్రతకు ఇంతటి చర్యలు తీసుకుంటున్నా కూడా ఇటువంటి సంఘటనలు జరగడం బాధాకరం. విద్యావంతుడైన ఓ ప్రొఫెసర్ చేసిన పనికి ఇప్పుడు దిశ చట్టం కింద పోలీసులకు చిక్కాడు. మహిళల రక్షణ కోసం ఇందుకోసం రాజమండ్రిలో ఇటివలే తొలి దిశ పోలిస్ స్టేషన్ కూడా ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: