ఏపీలో కొత్త ప్రభుత్వం దాదాపు 9 నెలలు కావొస్తుంది. ఓ వైపు సీఎం జగన్ తాను అనుకున్న ప్రతి నిర్ణయాన్ని అమలు చేసుకుంటూ ముందుకెళుతున్నారు. మరోవైపు జగన్ నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు పోరాటాలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే వీరి మధ్యలో ప్రజలు మాత్రం కన్ఫ్యూజన్‌లోనే ఉన్నారని తెలుస్తోంది. అసలు వీరిలో ప్రజలు మద్ధతు పూర్తిగా ఎవరికి ఉందో అర్ధం కాకుండా ఉంది. ఆఖరికి మూడు రాజధానుల విషయంలో కూడా ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

 

కొందరు మూడు రాజధానులని వ్యతిరేకిస్తుంటే, మరికొందరు సమర్ధిస్తున్నారు. అయితే ప్రజలు మద్ధతు ఎవరివైపు ఉన్నారో తెలియాలంటే స్థానిక సంస్థలు వరకు ఆగాల్సిందే. అవే ఏపీ రాజకీయాలకు టర్నింగ్ పాయింట్ కానున్నాయని తెలుస్తోంది. ఇక్కడే జగన్ సత్తా ఏంటో? బాబు ఆధిక్యం ఏంటో తెలిసిపోతుంది. కాకపోతే స్థానిక సమరం ఎప్పుడు అధికారంలో ఉన్న పార్టీకే అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్తితులు కాస్త భిన్నంగానే ఉన్నాయి.

 

అన్ని ప్రాంతాల్లో వైసీపీకి అనుకూల పవనాలు లేవు. అలా అని టీడీపీకి పెద్ద పాజిటివ్ లేదు. ఇక ఇలాంటి తరుణంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రం మొత్తం బస్ యాత్ర చేయాలని ఫిక్స్ అయ్యారు. ఫిబ్రవరి 17 నుంచి మొదలు పెట్టి దాదాపు 45 రోజుల పాటు రాష్ట్రం మొత్తం తిరిగి, రాజధాని సమస్యతో పాటు, వైసీపీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలని ప్రజలకు వివరించనున్నారు. చంద్రబాబు చేపట్టబోయే బస్సు యాత్రకు ‘ప్రజా చైతన్య యాత్ర పేరుతో... మొత్తం 45 రోజులపాటు యాత్ర సాగనుంది. 13 జిల్లాల్లోని 100కుపైగా నియోజకవర్గాల గుండా చంద్రబాబు బస్సు యాత్ర చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

 

అయితే స్థానిక సమరం మొదలు కానున్న నేపథ్యంలో బాబు బస్ యాత్ర చేయడం వల్ల, టీడీపీకి మైలేజ్ పెరిగే అవకాశముంది. ఇక వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలని కూడా ప్రజలకు అర్ధమయ్యేలా వివరిస్తే, ఎన్నికల్లో టీడీపీకి బెన్‌ఫిట్ ఉంటుంది. చూడాలి మరి బాబు బస్ యాత్ర ఎంతవరకు సక్సెస్ అవుతుందో?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: