2019లో సంవ‌త్స‌రం గులాబీ పార్టీకి పంట ఎన్నిక‌ల పంట పండింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అంచ‌నాల‌కు మించి  సీట్ల‌ను కైవసం చేసుకుంది. ప్ర‌తిప‌క్షం ఉనికి లేకుండా చేయ‌గ‌లిగింది. ఈ స్థాయిలో పార్టీ అప్ర‌తిహ‌తంగా దూసుకుపోయినా... అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కొన్ని.. ఎంపీ ఎన్నిక‌ల్లో కొన్ని ఎదురుదెబ్బ‌లు త‌గిలాయి. ముఖ్య‌మైన ఆ న‌లుగురు నేత‌లు ఓడిపోవ‌డం ఆయా జిల్లాల్లో తీవ్ర ప్ర‌భావ‌మే చూపుతోంది. అందులో మాజీ ఎంపీ బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్‌,  కేసీఆర్ త‌న‌య, నిజామాబాద్ మాజీ ఎంపీ క‌విత‌, భువ‌న‌గిరి మాజీ ఎంపీ బూర న‌ర్స‌య్య‌గౌడ్‌, మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు ఓట‌మి పార్టీని బేజారు చేసింది.

 

ఈ న‌లుగురు ముఖ్య‌నేత‌లు  వారివారి జిల్లాల్లో అన్నీతామై ముందుకు సాగిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. అయినా ఎదురుదెబ్బ‌ల నుంచి త‌ప్పించుకోలేక పోయారు. అయితే స్థానిక‌ రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు..జ‌నం నాడిలో మార్పు... బీజేపీ, కాంగ్రెస్ పార్టీల బ‌లం స్థానికంగా బ‌లంగా ఉండ‌టం, నాయ‌కుల‌ మ‌ధ్య స‌మ‌న్వ‌య‌లోపం ఇలా ఒక్కోచోట ఒక్కోర‌క‌మైన బ‌ల‌మైన కార‌ణంతో వీరు ఓట‌మి పాల‌య్యారు. వాస్త‌వానికి క‌విత‌ నిజామాబాద్ ఎంపీగా, టీఆర్ ఎస్ పార్టీలో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ నిత్యం జ‌న‌క్షేత్రంలో ఉంటూ వ‌చ్చారు. ఒంటిచేత్తో నిజామాబాద్‌లో చ‌క్రం తిప్పారు. అయితే అనుహ్యంగా ప‌సుపు రైతుల నుంచి వచ్చిన వ్య‌తిరేక‌త ఆమెను ఓట‌మి పాలు చేసింది.

 

టీఆర్ ఎస్‌లో మేధావివ‌ర్గంగా, కేసీఆర్‌కు త‌ల‌లో నాలుక‌గా ఉండే బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్ ఓట‌మి పార్టీకి పెద్ద‌దెబ్బ అనే చెప్పాలి. అక్క‌డ బీజేపీ నుంచి బండి సంజ‌య్ విజ‌యం సాధించారు. పార్ల‌మెంటులో గులాబీ గొంతుక‌నే వినోద్‌కుమార్ వినిపించ‌డంలో స‌క్సెస్ అయ్యారు. ప్ర‌స్తుతం ఆ కొర‌త క‌న‌బ‌డుతోంద‌న్న వాద‌న ఉంది. ఇక తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో  ఖ‌మ్మం జిల్లా పాలేరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోవ‌డం కేసీఆర్ను సైతం దిగ్బ్రాంతికి గురి చేసింది. తొలి ప్ర‌భుత్వంలో మంత్రిగా నాగేశ్వ‌ర్‌రావు హ‌ల్‌చ‌ల్ చేశారు.

 

త‌న స‌మ‌ర్థ‌వంత‌మైన ప‌నితీరుతో శాఖ‌ను ప‌రుగులు పెట్టించారు. ఏరి కోరి మ‌రి ఆయ‌న‌కు కేసీఆర్ మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. భువ‌న‌గిరి మాజీ ఎంపీ బూర‌నర్స‌య్య‌గౌడ్ ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఆయ‌న ఓట‌మిని జిల్లా టీఆర్ ఎస్ వ‌ర్గాలు ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక‌పోతున్నాయి. వీరిలో వినోద్‌కుమార్ కేసీఆర్ ప‌ద‌వి ఇచ్చినా.. మిగిలిన ముగ్గురికి ఎలాంటి ప‌ద‌వులు ఇస్తారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: