బెజవాడ సెంట్రల్ సీటు వంగవీటి రాధా కు వైసీపీ నిరాకరించడం తో రాధా అనుచరులు బెజవాడ లో అలజడి క్రీయేట్ చేస్తున్నారు. నిజానికి వంగవీటి ను వేరే స్థానం కు పంపించడానికి కారణం కూడా ఉంది. బెజవాడ లో పోయిన ఎన్నికల్లో వంగవీటి ఓడి పోయాడు. అయితే సీటు మార్పిడి వల్ల అంటే మచిలీపట్నం కు పంపిస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయని వైసీపీ భావిస్తుంది. అయితే బెజవాడలో నడిరోడ్డు మీద రాధా అనుచరుడు ఒకరు పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకునేందుకు ప్రయత్నించడంతో సీన్ బెంబేలెత్తించింది.
బెజవాడలో మరోసారి వర్గ పోరాటం రచ్చకెక్కబోతోందని సీన్ చెబుతోంది. అయితే ఆ సన్నివేశంలో సదరు అనుచరుడిని వారించిన రాధా ఆ ప్రమాదం నుంచి అతడిని రక్షించారు. అయితే జగన్ రాధాని దూరం పెట్టదలిచారా? విజయవాడ సెంట్రల్ వేరొకరికి కట్టబెట్టడం కోసం రాధాని వేరొక చోట నుంచి పోటీ చేయాల్సిందిగా చెబుతున్నారా? అంటే దానిపైనా సరైన క్లారిటీ లేదు. రాధా- బొత్స సత్యనారాయణ భేటీలో ఏం జరిగింది? అన్నదానిపైనా క్లారిటీ లేదు.
రాధా అనుచరులు మాత్రం ఇంకా నిర్ణయం ఫైనల్ కాలేదని చెబుతున్నారు. తొందరపడొద్దనే కార్యకర్తలకు చెబుతున్నామని అంటున్నారు. మరోవైపు విజయవాడ సెంట్రల్లో ఇప్పటికే బోలెడంత కార్యచరణ సాగించాం. రాజకీయంగా ఇక్కడ బలంగా ఉన్నాం. ఇప్పుడు జగన్ ఇలా యూటర్న్ తీసుకుంటే నిర్ణయం సీరియస్‌గానే ఉంటుందని ఒక వీరాభిమాని వీరంగం వేయడం చర్చకొచ్చింది. అసలింతకీ బెజవాడలో ఏం జరుగుతోంది? రాధాకు తాను కోరుకున్నది దక్కదా? ఒకవేళ దక్కకపోతే అక్కడ కాపులు వైకాపా వెంట నడుస్తారా.. నడవరా? అసలేం జరగనుంది? అంటూ ఆసక్తికర చర్చ ఏపీ పొలిటికల్ కారిడార్‌లో సాగుతోంది.