ఎంతటి ప్రతికూల పరిస్తితులైనా తాను అనుకున్నదే చేస్తారని ఆయనకు  పేరుంది. ఆయన ఏం అనుకుంటే అదే జరుగుతుంది తప్ప వాస్తవాలను బేరీజు వేసుకోవడం అసలు ఉండదన్న అపప్రధ కూడా ఉంది. సన్నిహితులు ఎంతలా ఖండించినా చూసే వారికి మాత్రం పిక్చర్ అలాగే కనిపిస్తోంది. మరి ఓసారి దెబ్బ తగిలింది, దాని నుంచి నేర్చుకుని ఈసారి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారా..


అవి పొరపాట్లు :


వైఎస్ జగన్ వస్తూ వస్తూనే స్టేట్ పాలిటిక్స్ లోకి  అలా జంప్ చేశారు. పెద్దగా అనుభవం లేకుండానే సొంతంగా పార్టీని పెట్టేశారు. అంతకు ముందు ఆయన వ్యాపార దిగ్గజం. దాంతో ఆయన పార్టీలోనూ కార్పోరేట్  స్టైల్ కనిపించేదని ఇంతకు ముందు చెప్పుకునేవారు. ఆయన ఎవరిని కావాలనుకుంటే వారే పార్టీలో ఉండేవారు, వద్దనుకునే వారు పోయేవారు. జనాల్లో ఆదరణ చూసి జగన్ అతి విశ్వాసంతో గతంలో ఇలా కొన్ని తప్పులు చేశారని సొంత పార్టీలోనూ చెబుతారు.


స్టైల్ మారిందా :


అయితే త్రుటిలో అధికారం తప్పిపోయిన తరువాత జగన్లో కొంత మార్పు వచ్చిందని చెబుతున్నారు.  నాలుగున్నరేళ్ళ ప్రతిపక్ష పాత్ర కూడా ఆయనను రాటుతేల్చిందని  కూడా అంటారు. అలా జగన్ ఇపుడు తన స్టైల్ మార్చుకున్నారని అంటున్నారు. పార్టీలో అందరూ ముఖ్యమేనని, అలా బాలన్స్ చేసుకోవడం ద్వారానే విజయాన్ని సాధించగలమని జగన్ భావిస్తున్నరట. ఇలా కనుక అడుగులేస్తే ఇది పార్టీకి మంచిదేనని కూడా అంటున్నారు.


బుజ్జగింపులకు రెడీ :


ఇది వైసీపీలో ఎన్నడూ చూడని సీనే. పార్టీలో ఓ నాయకుడు తనకు అన్యాయం జరిగిందని భావిస్తే అతన్ని పిలిచి మాట్లాడే పధ్ధతి ఇంతకు ముందు లేదు. మరీ అనుకుంటే పార్టీలోని ఇతర నాయకులతో మాట్లాడించడంతో  సరిపెట్టేవారు. ఇపుడు మాత్రం డైరెక్ట్ గా జగన్ రంగంలోకి దిగుతున్నారు. అలాంటి ఘటన తాజాగా జరిగింది. వంగవీటి రాధా ఎపిసోడ్ లో జగన్ నేరుగా అతనితో ఫోన్లో మాట్లాడి బుజ్జగించడం అన్నది ఇపుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. 



ఇది జగన్ స్టైల్ కి విరుధ్ధమే అయినా ఆయన మారారని చెప్పడానికి సంకేతం అంటున్నారు. అలాగే విశాఖలో కొన్ని సీట్లు కొందరికి కాదన్నపుడు కూడా జగన్ వారిని పిలిచి నచ్చచెప్పడం జరిగిందని టాక్. పార్టీ పవర్లోకి వస్తే ప్రయార్టీ ఇస్తానని చెప్పడం ద్వారా అసంత్రుప్తులకు జగన్ అడ్డుకట్ట వేస్తున్నారని అంటున్నారు. ఇదే నిజమైతే వైసీపీ విజయానికి ఇక తిరుగులేదని పార్టీ నాయకులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: