పోలవరం ప్రాజెక్టు.. ఆంధ్రుల కల.. ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకుంటున్న ప్రాజెక్టు.. చంద్రబాబు సర్కారు దీన్ని 2018 నాటికి పూర్తి చేస్తామని 2014లో అధికారంలోకి రాగానే చెప్పారు. కానీ ఆ కల సాకారం చేయలేకపోయారు. చంద్రబాబు అధికార కాలం పూర్తయినా పోలవరం మాత్రం సగం కూడా నిర్మాణం కాలేదు. ఇందుకు కేంద్రం సహకరించలేదని చంద్రబాబు సాకులు చెప్పుకుంటూ ఎన్నికలకు వెళ్లారు.


ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాక.. పోలవరం లో జరిగిన అవినీతిని వెలికి తీస్తానంటున్నాడు. రివర్స్ టెండరింగ్ చేస్తానంటున్నాడు.. 2021 నాటికి పోలవరం పూర్తి చేస్తానంటున్నాడు. అయితే జగన్ అన్నంత పని చేస్తాడని అనుకున్నారో ఏమో.. చంద్రబాబు పోలవరం కలగా మిగిలిపోతుందేమో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ పెట్టారు.


పోలవరం ప్రాజెక్టులో డెబ్బై శాతం పూర్తి చేశామని చంద్రబాబు నాయుడు ఆ ట్వీట్ లో చెప్పుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ తన పాదయాత్రలో పోలవరానికి పునాదులే పడలేదని విమర్వలు చేశారని ఆయన అన్నారు. ఈరోజు స్పిల్ వేలో ఉండే రివర్స్ స్లూయిజ్‌ గేట్ల ద్వారా 2లక్షల క్యూసెక్కుల వరద నీటిని ఎలా మళ్లించారని ఆయన అన్నారు.


అవహేళనలు, ఆరోపణలను ఎదుర్కొంటూనే పోలవరం 70శాతం నిర్మాణం పూర్తి చేశామని, మిగిలిన 30శాతం పూర్తి చేయకపొతే పోలవరం ఒక కలగానే మిగిలిపోతుందని చంద్రబాబు అబిప్రాయపడ్డారు. వరద సమయంలో ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న సంస్థలకు వెనక్కు వెళ్లిపోవాలి అంటూ నోటీసులు ఇచ్చారని.. దీన్ని బట్టే ప్రాజెక్ట్ నిర్మాణం పట్ల జగన్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, దూరదృష్టి ఏపాటిదో అర్థం అవుతోందని చంద్రబాబు విమర్శించారు.


అంటే ఏంటీ చంద్రబాబు ఉద్దేశం.. పోలవరం కలగా మిగిలిపోతుందనా.. జగన్ పోలవరం కట్టలేడని చంద్రబాబు చెప్పదలచుకున్నారా..? ఇలాంటి శాపాలు పెడితే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు చంద్రబాబును మెచ్చుకుంటారా..?


మరింత సమాచారం తెలుసుకోండి: