ప్రధాని మోదీ నేడు దాదాపు 37 నిముషాల పాటు 'మన్ కి బాత్ ' తో‌ ప్రజలతో‌ మాట్లాడారు. అందులో‌  కొన్ని కీలక విషయాలు


  • ఒక దేశంగా, ఒక కుటుంబంగా, మీరు, మేము, దేశం మొత్తం కలిసి ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాము. జమ్మూ కాష్మీర్, లడఖ్, మొత్తం దేశ ప్రజలను నేను అభినందిస్తున్నాను. ఆర్టికల్ 370 వల్ల జమ్మూ కాశ్మీర్, లడఖ్ మన తోబుట్టువులు అనేక హక్కులను వారు కోల్పోయారు, ఇది వారి అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా ఉంది.


  • ఆర్టికల్ 370 చేసిన హాని గురించి ఎవరూ మాట్లాడలేదు. ఆర్టికల్ 370 భీభత్సం మరియు అవినీతికి ఆజ్యం పోసిందని పిఎం చెప్పారు.


  • ఆర్టికల్ 370 ను ఆయుధంగా ఉపయోగించారు. ఇప్పుడు, భారతీయులందరికీ ఒకే హక్కులు ఉన్నాయి. ఇది జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ ల భవిష్యత్తును భద్రపరుస్తుందని ప్రధాని అన్నారు.


  • సర్దార్ పటేల్, బి.ఆర్.అంబేద్కర్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ, కొన్ని కోట్ల మంది ప్రజల కలలు నిజమయ్యాయని పీఎం మోడీ చెప్పారు.


  • జమ్మూ కాశ్మీర్ లొ ఆడవారు గతం లో వారి హక్కులు కోల్పోయారు. ఇప్పుడు అక్కడ వారి పాత చట్టాలు పనిచేయవు. జమ్మూ కాశ్మీర్‌లో ఎస్సీ / ఎస్టీలకు చట్టం వర్తించదని ప్రధాని తెలిపారు.


  • సఫై కరంచారిస్ చట్టం దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని కార్మికులకు వర్తిస్తుంది, అయితే జమ్మూ కాశ్మీర్‌ లోని కార్మికులకు అది ఇప్పటి వరకు వతించలేదని అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో దళితులపై దారుణాలను నివారించడానికి కఠినమైన చట్టాలు అమలులో ఉన్నాయని, అయితే జమ్మూ కాశ్మీర్‌లో అవి ఇప్పటి వరకూ‌ లేవని ప్రధాని మోదీ అన్నారు.


  • త్వరలో, జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లో ఖాళీగా ఉన్న కేంద్ర, రాష్ట్ర పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వ రంగ విభాగాలు, ప్రైవేటు రంగ సంస్థలను కూడా ఉద్యోగాలు కల్పించేలా ప్రోత్సహిస్తామని ప్రధాని తెలిపారు.


  •  పోలీసులతో సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇతర కేంద్రపాలిత ప్రాంతాల ఉద్యోగులతో సమానంగా త్వరలో అన్ని ప్రయోజనాలు లభిస్తాయని ప్రధాని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ ని కేంద్ర పరిపాలనలో కొంత కాలం ఉంచాలనే నిర్ణయం బాగా ఆలోచించాకే తీసుకున్నామన్నారు.


  • కాశ్మీర్ తాత్కాలికంగా మాత్రమే కేంద్రంలో ఉంటుంది , ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, జమ్మూ కాశ్మీర్‌ లో ప్రజలకి నచ్చిన ముఖ్యమంత్రి ఉంటారని ప్రధాని మోదీ అన్నారు.


  • తమకు నచ్చిన ప్రతినిధులను పారదర్శకంగా ఎన్నుకునే అవకాశం జమ్మూ కాశ్మీర్‌ లో ప్రజలకి లభిస్తుందని ప్రధాని హామీ ఇస్తున్నాను అని చెప్పారు

మరింత సమాచారం తెలుసుకోండి: