ఒక దేశంను ఒక రాజు పరిపాలిస్తుండేవాడు. అతని వద్ద సుబుద్ధి అని ఒక మంత్రి ఉండేవాడు. రాజు ప్రతి రోజు నిద్ర లేచిన వెంటనే నిత్య కృత్యములు పూర్తి చేసుకున్న అనంతరమే కత్తిసాము చేస్తుండగా కత్తి జారీ .. రాజు గారి కాలి చిటికెన వేలు తెగింది.ఆ విషయాన్ని గమనించిన మంత్రి ఇలా అన్నాడు.


"దేవుడు ఏమి చేసినను అది మన మేలు కోసమే"అనే మాట మంత్రి అన్నాడు. రాజు ఆ మాటలు విని చాలా కోపంగా ఇలా అన్నాడు. "నిన్ను కారాగారంలో బంధించడమే నీకు మేలు"అని సుబుద్ధుని కారాగారము నందు వేయించాడు రాజు. మంత్రి విచారంగా కారాగారంలో ఉన్నాడు. ఒకరోజు రాజు వేటకు వెళ్లాల్సి వచ్చింది. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో రాజుకి అలసట వచ్చి గుఱ్ఱమును చెట్టు కింద కట్టివేసి తాను కూడా ఆ చెట్టు నీడలో పడుకున్నాడు.


దొంగలు అడవి ప్రాంతంలో తిరుగుతూ ఉండగా దొంగలకు అక్కడ నిద్రిస్తున్న రాజును కట్టేసి దేవాలయంలోకి తీసుకొనిపోయి బలి ఇవ్వాలనుకున్నారు. అందులో ఒక దొంగ రాజు కాలిని చూసి, వీడు అంగవైకల్యం ఉన్నవాడు..కాబట్టి వీడు దేవికి  బలి ఇవ్వడానికి పనికిరాడు. అని అనడంతో  ఆ దొంగలు రాజును తన్ని తరిమేశారు. చూశారా..! దేవుడు ఏమి చేసినా  మన కొరకే అని మంత్రి సుబుద్ధి అన్న మాటలు రాజుకి గుర్తుకు వచ్చి..వెంటనే  జైలు లోపల ఉన్న సుబుద్ధి తో తన ప్రాణములు నిలిపినవాడు విషయాన్ని చెప్పి క్షమాపణ అడిగారు.

రాజు సుబుద్ధిని జైలు లోపల వెయ్యకుంటే.. సుబుద్ధి కూడా రాజు వెంట వేటకు  వెళ్లక తప్పేది కాదు. మంత్రి సుబుద్ధి ని చూసిన దొంగలు తప్పక ఇతడిని చంపేవారు. కానీ రాజు కూడా ఒక రకంగా  మంత్రినీ కూడా కాపాడాడు అని  రాజును  మెచ్చుకున్నాడు మంత్రి  కావున దేవుడు ఏం చేసినా అది మన మంచికేనని మనం కూడా గ్రహించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: