ఒక కుర్రాడు ఒక మెడికల్ షాప్ కి వెళ్లి ఫోన్ చేసుకుంటానని షాప్ ఓనర్ ని అడిగాడు." ఇది ఎస్.టి.డి బూత్ కాదు కానీ, నువ్వు ఒక ఫోన్ కాల్ చేసుకో"అని బదులిచ్చాడు ఓనర్.

ఆ కుర్రాడు రిసీవర్ ఎత్తి ఒక నెంబర్ కి డయల్ చేశాడు. షాపులో కస్టమర్లు ఎవరూ లేకపోవడంతో షాపు ఓనర్ కుర్రాన్ని గమనిస్తూ అతని ఫోన్ సంభాషణ వినసాగాడు.
"అమ్మ మీరు నాకు తోటమాలి జాబ్ ఇవ్వగలరా?" అని ఫోన్ లో అడిగాడు కుర్రాడు. "ఇప్పటికే ఒకతను నా దగ్గర తోటమాలి గా ఒక వ్యక్తి పని చేస్తున్నాడు"అని అంది అవతలి స్త్రీ.

"అమ్మ నేను మీ తోటమాలి జీతంలో సగం జీతానికి అతని కంటే ఇంకా బాగా పని చేస్తాను" అన్నాడు కుర్రాడు.నా దగ్గర పనిచేసే వ్యక్తి పని సంతృప్తికరంగా ఉందని ఆ స్త్రీ బదులు ఇచ్చింది. ఆ కుర్రాడు మరింత పట్టుదలతో "అమ్మ నేను మీ ఇల్లంతా వూడుస్తాను.  మీ ఇంటినీ, తోటను ఈ నగరంలోనే అత్యంత అందమైన ఇల్లుగా, తోటగా మారుస్తాను" అని అన్నాడు.
"అవసరం లేదు బాబూ"అని అవతల స్త్రీఫోన్ పెట్టేసింది.


ముఖంపై చిరునవ్వు తో ఆ కుర్రాడు ఫోన్ రిసీవర్ పెట్టేశాడు.అతని సంభాషణ విన్న షాపు ఓనర్ ఆ కుర్రాడి తో "బాబూ! నాకు నీ వ్యక్తిత్వం నచ్చింది. నీలో ఉన్న ఆశావహదృక్పథం నన్నెంతో ఆకట్టుకుంది. నీకు నేను ఒక జాబ్ ఇస్తాను చేస్తావా?"అని అడిగాడు."చాలా కృతజ్ఞతలండి. కానీ నేను నా పనితనాన్ని గురించి తెలుసుకోవడానికి ఈ ఫోన్ కాల్ చేశాను. నేను ఇందాక మాట్లాడిన ఆమె దగ్గరే తోటమాలి గా పనిచేస్తున్నాను"అని జవాబిచ్చాడు కుర్రాడు. ఇక ఆ కుర్రాడు ఈ మాట అనడం తో కంగుతిన్న ఆ మెడికల్ షాప్ ఓనర్.. షాక్ నుంచి తేరుకొని ఆ కుర్రాడి తెలివితేటలు మెచ్చుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: