గోవిందనగిరి గ్రామంలో సుందరయ్య అనే రైతు ఉండేవాడు..అతడికి రమేష్ అనే కొడుకు వుండేవాడు.రమేష్ పదవ తరగతి చదువుతున్నాడు. రమేష్ మంచివాడే కానీ కోపిష్టి కాకపోతే ఎంత కొట్లాడిన కోపం దిగి పోగానే క్షమాపణ అడుగుతుంటూ వుండేవాడు. రమేష్ రోజూ ఇలా గొడవలు ఇంటి పైకి తెస్తూ వుండటంతో.. రంగయ్య అతన్ని గట్టిగా మందలించాడు. 'రమేష్! నీకు కోపం వచ్చినప్పుడల్లా పెరటి తలుపుకి ఒక మేకు కొట్టు'అని చెప్పాడు. రమేష్ ఆ తర్వాతి రోజు నుంచే మేకులు కొట్టడం మొదలు పెట్టాడు.


రానురాను ఆ మేకులతో తలపంతా అందవిహీనంగా కనిపించసాగింది. ఓ రోజు రంగయ్య రమేష్ కి అది చూపించి. ఈ మేకులతో తలుపు చూడటానికి అసహ్యంగా ఉంది కదా! నువ్వు కోప్పడే కొద్దీ ఎదుటివాళ్ళు కూడా నిన్ను ఇలాగే చూస్తారు... అని చెప్పాడు. అర్థమయ్యింది నాన్న.... నన్ను నేను మార్చుకుంటాను! అన్నాడు. అప్పుడు రంగయ్య మంచిదే! నువ్వు కోపాన్ని నిగ్రహించుకున్నా ప్రతిసారి ఒక్కో మేకును తీసేస్తూ ఉండు అన్నాడు.


రమేష్ అలాగే చేయటం మొదలు పెట్టాడు... అతను మేకును తొలగించిన ప్రతిచోటా తలుపు పైన ఆ మేరకు చిన్న చిల్లు మిగిలిపోయింది. అప్పుడు రంగయ్య రమేష్ భుజంమీద చేయి వేసి,  నువ్వు ఎదుటి వాళ్ళ పైన కోపం చూపించినప్పుడల్లా వాళ్ళ మనసులో నువ్వు ఓ మేకుని దించినట్లే , ఆ తర్వాత చెప్పే క్షమాపణ కొట్టిన మేకును తీయటం లాంటిది. నువ్వెంత నిజాయితీగా, శ్రద్ధగా మేకుని తీసినా ఎదుటి వాళ్ళ మనసు పైన ఇలాంటి చిల్లు  ఒకటి మిగిలిపోతుంది. కాబట్టి  ఎవరిని అనవసరంగా కోప్పడకూడదు...! అని చెప్పాడు. రంగయ్య మాటల్లోని నిజాన్ని గ్రహించిన రమేష్ మరేప్పుడూ ఇతరుల మీద కోపాన్ని ప్రదర్శించలేదు.కాబట్టి కేవలం రమేష్ మాత్రమే ఈ కాలంలో చాలామంది యువత అలాగే వున్నారు..ఇక ఇష్టపడిన అమ్మాయి వొప్పుకొకపోతే ఆ అమ్మాయి ముఖం పై యాసిడ్ కూడా పోస్తున్నారు.ఆ అమ్మాయి జీవితాలనే నాశనం చేస్తున్నారు.యువత ఇప్పటికైనా మీ కోపాన్ని తగ్గించుకొని, బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి: