అనంత ప్రభ నగరంలో వర్ధనుడు అనే యువ జమిందారు ఉండేవాడు. అతని చుట్టూ ఎప్పుడూ నలుగురు మిత్రులు కబుర్లు చెబుతూ కూర్చునేవారు. వాళ్లు వర్ధనుడిని తెగ పొగిడేవారు. ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు అనుభవ రహితుడైన వర్ధినుడు సరైన పరిష్కారం చూపక పోయినా. అతని మిత్రులు మాత్రం ఆ తీర్పు సరైనదే అంటూ ఊదర గొట్టెవారు. ఒకసారి వర్ధనుడి చిన్ననాటి మిత్రుడు వివాహానికి ఆహ్వానించడానికి వచ్చాడు. తనతో పాటు బయల్దేరి రమ్మని కోరాడు . ప్రయాణం కోసం పెద్ద గురువు, బగ్గీ కట్టించారు. అందరూ ఎక్కారు మధ్యలో ఒక కర్ర గట్టు మీది నుంచి వాగును దాటుతున్నారు.


ఆ క్రమంలో బగ్గీ బురదలో కూరుకుపోయి తిరగబడింది. అందరి వస్త్రాలు పాడైపోయాయి చేసేది లేక నడుస్తూ ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడ కొందరు జాలరులు చేపల వాటాల కోసం తగాదా పడుతుంటే వర్ధనుడు మధ్యలో దూరి న్యాయం చెప్పబోయాడు. అంతే... వాళ్లలో ఒకడు వర్ధనుణిడిని తోసేసి... వెళ్లవయ్యా... వెళ్ళు... పెద్ద మర్యాద రామన్న ల వచ్చేసావు. నా వాటా కి ఒక చేప వేస్తావా.... అంటూ నానా తిట్లు తిట్టి నాడు. వర్ధనుడు చిన్నబోయాడు .అతని నేస్తాలు వెనకాలే కిసుక్కున నవ్వుకున్నారు.


వెంటనే అతని బాల్య మిత్రుడు భుజం తడుతూ.... మిత్రమా మీ నగరంలో అధికారం మీది కావటం వల్ల ఎలాంటి తీర్పు ఇచ్చినా చెల్లింది. దానికి మిత్రులు వంతు పాడటంతో నీకు కొన్ని సార్లు విషయం అవగాహన కాలేదు. ఇప్పుడు ఇక్కడ  నీకే అధికారం లేదు. నీ రూపం బురద అంటుకొని విలువ కోల్పోయింది కదా... అందుకే నిన్ను ఎవరు పట్టించుకోలేదు. ఇకనైనా విజ్ఞత ప్రదర్శించి మెప్పు పొందు అన్నాడు. వర్ధనుడు అతనికి కృతజ్ఞతలు చెప్పి  తనతో నిజాయితీగా ఉండమని తన నేస్తాలను మందలించాడు. వాళ్ళు తప్పు తెలుసుకుని క్షమించమని కోరగా మన్నించాడు. అదే కదా నిజమైన స్నేహం!

మరింత సమాచారం తెలుసుకోండి: