అనగనగా ఒక ఊరిలో ఒక కపటపు దొంగ కాకి ఆ వూరి చివరన ఒక కొమ్మ పైనా నివసిస్తూ ఉండేది. అది దొంగతనంగా ఇతర పక్షుల గూళ్ల లోని గుడ్లను ప్రతి రోజూ తినడానికి బాగా అలవాటు పడింది. తోటి కాకులు అది మంచి పని కాదని ఎంత చెప్పినా వాటి మాటను పెడచెవిన పెట్టింది. అలా ఆ దుర్మార్గపు కాకి చాలా పక్షుల గుడ్లను పొట్టన పెట్టుకుంది. ఒకరోజు ఆ గ్రామానికి కొన్ని కొంగలు వలస వచ్చి చింత చెట్టు మీద గూళ్లను పెట్టుకున్నాయి.

అది లేని సమయం చూసి.. ఆ కొంగలు పెట్టుకున్న వాటి గుడ్లను ఆరగించసాగింది కాకి..ఇక  తమ గుడ్లు ఎవరో తినేయడం .. తమ పిల్లలు కనిపించకపోవడంతో కొంగలు చాలా  బాధ పడ్డాయి. దీనికంతటికీ కారణమైన వారిని విడిచి పెట్టకూడదని అన్నీ ఒకటయి దాని అంతు చూడాలని అనుకున్నాయి. ఇదంతా చేస్తున్నది ఒక కాకి అని ఉడుత ద్వారా తెలుసుకున్నాయి ఆ కొంగలు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న కొంగలు.  కాకి గూడు కట్టి గుడ్లు పెట్టడం చూశాయి.

ఇక కొంగలు కాకి లేని సమయంలో గూటితో సహా... గుడ్లను మాయం చేశాయి. తన గూడు గుడ్లు కనిపించకపోయేసరికి కాకి బాగా ఏడ్చింది. గుడ్లను, పిల్లలను పోగొట్టుకున్న తల్లి బాధ ఎలా ఉంటుందో అప్పుడు అర్థమయ్యింది దానికి .. తన తప్పు తెలుసుకున్న కాకి ప్రశ్చాత్తాపడింది. దానిలో వచ్చిన మార్పును గమనించిన కొంగలు , కాకి గూటిని,  గుడ్లను కూడా వెనక్కి తెచ్చి ఇచ్చాయి. తాను హాని చేసినా కూడా తనకు కీడు చెయ్యని కొంగలకు కృతజ్ఞతలు తెలిపింది కాకి.. ఇక అప్పటి నుంచి ఆ కాకి..అది కష్టపడి ఆహారాన్ని సంపాదించుకోవడం ప్రారంభించింది. గింజలు, పురుగులు వంటివి దోరికినంతనే  మాత్రమే తినాలని నియమం పెట్టుకుంది. అలా పాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: