అడవిలో ఉండే నక్క ఒకటి.. ఒకనాడు దారి తప్పి ఊళ్లోకి వచ్చేసింది. అది తోవ వెంబడి వెళ్తుండగా ఒకకుక్క దానికి ఎదురు వచ్చింది.
నక్క ఆ కుక్కను ఆశ్చర్యంగా చూస్తూ "నీ మెడలో ఆ గొలుసు ఆ బిల్లా ఏమిటి?"అని ప్రశ్నించింది
"ఓహో! అదా! నన్ను నా యజమాని పెంచుకుంటున్నాడు. వీధి కుక్కలతో పాటు నన్ను పట్టుకువెళ్లి కాల్చివేయకుండా ఉండటానికి ఈ బిల్లును నా మెడలో కట్టాడు"అని కుక్క చెప్పింది.

ఆశ్చర్యంగా ఉందే అంది నక్క.. నువ్వు అడవిలో ఉంటావు కాబట్టి నీకు తెలియదులే మా యజమాని చాలా మంచివాడు. నన్ను తన ఇంట్లో పెట్టుకుని పెంచుకుంటున్నాడు. నాకు మంచి మంచి రొట్టెలు, మాంసము , పాలు అన్నీ పెడతాడు. రోజు వేడి నీళ్లతో స్నానం చేయిస్తాడు. నాకు తినటానికి పళ్లెం , పాలు తాగడానికి గిన్నె ఉన్నాయి .అంతే కాదు పడుకోవటానికి మెత్తటి పరుపు కూడా ఉంది.అంది కుక్క గర్వంగా.. అలాగా అంది నక్క ఈర్ష్యగా.. నా యజమాని దగ్గర బోలెడన్ని పిల్లిలు ఉన్నాయి. జాతి వైరం మరిచి మేము అంతా ఆడుకుంటాం అని చెప్పింది కుక్క.


మిత్రమా ఈరోజు నుంచి మనమిద్దరం స్నేహితులం.. నన్ను మీ ఇంటికి తీసుకు వెళ్ళు అంది నక్క.. సరే అని కుక్క నక్కను తన ఇంటికి తీసుకెళ్లింది. యజమాని చూస్తే కొడతాడని చెట్టుచాటున దాచి తన రొట్టెలు, మాంసము నక్కకు పెట్టసాగింది కుక్క.

తనకు చేసే అతిధి మర్యాదలను సంతోషించాల్సింది పోయి.. అడవిలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండే ఈ కుక్కకు ఇన్ని సౌకర్యాలు..ఇంత వైభోగమా  అని అసూయపడి నక్క,  నువ్వు వచ్చి చాలా రోజులు అయింది నా యజమాని చూస్తే నన్ను చంపేస్తాడు వెళ్ళిపో అంది కుక్క.. ఎవరైనా సరే ఏదీ శాశ్వతం కాదని గుర్తించుకోవాలి కష్టపడి పని చేస్తేనే మనకు ఆహారం లేదా ఏదైనా లభిస్తుంది అనే విషయం గుర్తుంచుకున్నప్పుడు ప్రతి ఒక్కరు దర్జాగా, హాయిగా బ్రతకగలుగుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: